Love At 65 Trailer : 65 ఏళ్ళ వయసులో రాజేంద్రప్రసాద్‌తో జయప్రద ప్రేమ.. ట్రైలర్ చూశారా?

65 ఏళ్ళ వయసులో రాజేంద్రప్రసాద్‌, జయప్రద మధ్య కలిగే ప్రేమ నేపథ్యంలో లవ్@65 సినిమా ఉండబోతుంది.

Love At 65 Trailer : 65 ఏళ్ళ వయసులో రాజేంద్రప్రసాద్‌తో జయప్రద ప్రేమ.. ట్రైలర్ చూశారా?

Rajendra Prasad Jayaprada Love at 65 Trailer Released

Updated On : February 16, 2024 / 5:59 PM IST

Love At 65 Trailer : టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మనసంతా నువ్వే, నేనున్నాను.. లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ‘లవ్@65’ సినిమా రాబోతుంది. ఇందులో మెయిన్ లీడ్స్ గా రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) తో పాటు అలనాటి హీరోయిన్ జయప్రద(Jayaprada) నటించబోతున్నారు. 65 ఏళ్ళ వయసులో వీరిద్దరి మధ్య కలిగే ప్రేమ నేపథ్యంలో లవ్@65 సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సునీల్, అజయ్.. తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Amaran Glimpse : శివకార్తికేయన్ ‘అమరన్’ టైటిల్ గ్లింప్స్ చూశారా? కశ్మీర్ నేపథ్యంలో..

తాజాగా ఈ లవ్@65 సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఫన్నీగా సాగింది. చివర్లో కొంచెం ఎమోషన్ ని కూడా చూపించారు. రాజేంద్రప్రసాద్, జయప్రద 65 ఏళ్ళ వయసులో లేచిపోవడం, వారి ప్రేమ కోసం లోకాన్ని ఎదురిస్తా అనడం.. సినిమా కామెడీతో పాటు ఎమోషన్ కూడా ఉండబోతున్నట్టు ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.