Udit Narayan : 69 ఏళ్ళ వయసులో.. లైవ్ షోలో అమ్మాయికి లిప్ కిస్ ఇచ్చిన సీనియర్ స్టార్ సింగర్.. వివాదం చెలరేగడంతో..

నిన్న రాత్రి నుంచి సీనియర్ స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్‌ లైవ్ షోలో జరిగిన ఘటన వైరల్ అవుతుంది.

Udit Narayan Gives Clarity on Kissing with Lady Fan in Live Show

Udit Narayan : ఇటీవల సింగర్స్ లైవ్ కాన్సర్ట్స్ పేరుతో షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సింగర్స్ ని కలవడానికి, చూడటానికి ఫ్యాన్స్ వేలాదిగా వస్తున్నారు. లైవ్ షోలలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు వైరల్ అవుతూ ఉంటాయి. నిన్న రాత్రి నుంచి సీనియర్ స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్‌ లైవ్ షోలో జరిగిన ఘటన వైరల్ అవుతుంది.

హిందీతో పాటు తెలుగు, తమిళ్..అనేక భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్‌. 69 ఏళ్ళు వచ్చినా ఇంకా ఆయన పాటలతో అలరిస్తున్నారు. తాజాగా నిన్న ఉదిత్ నారాయణ్‌ ఓ లైవ్ షో నిర్వహించారు. ఈ షోలో ఆయన స్టేజిపై పాట పాడుతుండగా ఆయనతో సెల్ఫీలు తీసుకోడానికి కొంతమంది అమ్మాయిలు స్టేజి వద్దకు వచ్చారు. దీంతో ఉదిత్ నారాయణ్‌ పాడుతూనే స్టేజిపై కూర్చొని సెల్ఫీలు ఇస్తున్నారు.

Also Read : Thaman : హీరోగా నటించనున్న తమన్‌?

ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిలు ఆయనతో సెల్ఫీ తీసుకున్న తర్వాత ఉదిత్ నారాయణ్‌ వాళ్ళ బుగ్గలకు ముద్దులు పెట్టాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి దగ్గరకు రావడంతో లిప్ కిస్ పెట్టారు ఉదిత్ నారాయణ్‌. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి ముద్దు కోసం రాకపోయినా ఉదిత్ నారాయణ్‌ ఆమెను దగ్గరకు తీసుకొని కిస్ పెట్టడంతో సంచలనంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఈ ఏజ్ లో ఇలాంటి పనులేంటి అని విమర్శిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఉదిత్ నారాయణ్‌ పై ట్రోల్స్ వస్తున్నాయి.

Also Read : Vishwambhara : చిరంజీవి విశ్వంభర VFX టీమ్ మారిందా? ఆ సెక్షన్ కి డైరెక్టర్ కూడా మారాడా?

అయితే తాజాగా ఉదిత్ నారాయణ్‌ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి స్పందించాడు. ఉదిత్ నారాయణ్‌ ఈ వివాదంపై మాట్లాడుతూ.. అభిమానులకు నేను అంటే చాలా ఇష్టం. అభిమానులు తమ ప్రేమను నా మీద వివిధ రకాల్లో తెలియచేస్తారు. కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు. కొంతమంది ముద్దు పెట్టుకుంటారు. అది కేవలం ఆత్మీయతో కూడుకున్నది మాత్రమే. వారితో తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం నాకు లేదు. నాకు సమాజంలో మంచి పేరు ఉంది. నేను వివాదాలకు దూరంగా ఉంటాను. కొంతమంది దీన్ని కావాలని వివాదం చేస్తున్నారు అని అన్నారు.