Unstoppable With NBK : ‘వారం వారం రావడానికి నేను సీరియల్‌ని కాదు.. సెలబ్రేషన్’.. బాలయ్య ఎనర్జీ అరుపులు అసలు..

నటసింహా నందమూరి బాలకృష్ణ Unstoppable లేటెస్ట్ ప్రోమో అదిరిందిగా!..

Unstoppable With NBK: ఇప్పుడు ఎక్కడ చూసినా నటసింహా నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల ‘అఖండ’ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఇక పాపులర్ ఓటీటీ ‘ఆహా’ లో Unstoppable షో తో ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ప్రోమోలతోనే పిచ్చెక్కించిన బాలయ్య.. అంత బాగా హోస్ట్ చేస్తారని ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. అందరి అంచనాలను తారుమారు చేశారు.

Jai Balayya : బాలయ్య క్లాస్‌లో మాస్.. ఆ స్టెప్పులేంటి స్వామీ!

ఇటీవల బాలయ్య చేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. దీంతో షో కి కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. శుక్రవారం తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ‘మరింత ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో బాలయ్య బాబు ఈజ్ బ్యాక్’ అంటూ ‘ఆహా’ టీం మూడో ఎపిసోడ్‌లో బాలయ్య పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Unstoppable With NBK : బాలయ్య బాబు ఈజ్ బ్యాక్!

గెటప్ దగ్గరినుండి మాట్లాడే విధానం వరకు సరికొత్తగా కనిపిస్తూ తన స్టైల్లో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీలతో సందడి చేసిన బాలయ్య.. రెండో ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నానితో హంగామా చేశారు.

Akhanda Mass Jathara : దేవుణ్ణి కరుణించమని అడుగు.. కనిపించమని కాదు.. బాలయ్య ‘మాస్ జాతర’

ఇక సోమవారం Unstoppable కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. ‘మూడు వారాలు గ్యాప్ వచ్చింది.. ఎన్నో మెసేజెస్, ఎన్నో ఫోన్ కాల్స్.. నేనెలా ఉన్నానని కాదు.. మూడో ఎపిసోడ్ ఎప్పుడా అని.. వారం వారం రావడానికి నేను సీరియల్‌ని కాదు.. సెలబ్రేషన్’.. అంటూ బాలయ్య తన స్టైల్ ఎనర్జీతో అలరించారు. త్వరలో మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు