Unstoppable With NBK : బాలయ్య బాబు ఈజ్ బ్యాక్!

సర్జరీ తర్వాత Unstoppable షూటింగ్‌లో జాయిన్ అయిన బాలయ్య..

Unstoppable With NBK : బాలయ్య బాబు ఈజ్ బ్యాక్!

Unstoppable With Nbk

Updated On : November 27, 2021 / 6:59 PM IST

Unstoppable With NBK: నటసింహం నందమూరి బాలకృష్ణ పాపులర్ ఓటీటీ ‘ఆహా’ లో Unstoppable షో తో ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ప్రోమోలతోనే పిచ్చెక్కించిన బాలయ్య.. అంత బాగా హోస్ట్ చేస్తారని ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. అందరి అంచనాలను తారుమారు చేశారు.

Mokshagna : వారసుడొస్తున్నాడు.. బాలయ్య షో లో మోక్షజ్ఞ..

గెటప్ దగ్గరినుండి మాట్లాడే విధానం వరకు సరికొత్తగా కనిపిస్తూ తన స్టైల్లో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీలతో సందడి చేసిన బాలయ్య.. రెండో ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నానితో హంగామా చేశారు.

Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ టీజర్ అప్‌డేట్..

ఇటీవల బాలయ్య చేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. దీంతో షో కి కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. శుక్రవారం తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ‘మరింత ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో బాలయ్య బాబు ఈజ్ బ్యాక్’ అంటూ ‘ఆహా’ టీం మూడో ఎపిసోడ్‌లో బాలయ్య పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్రహ్మానందం, అనిల్ రావిపూడి ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది.