Unstoppable With NBK S4 : ఏం డైరెక్ట‌ర్ గారు చొక్కా మీద చొక్కా వేశారు.. బాబీతో బాల‌య్య.. అన్‌స్టాప‌బుల్ ప్రొమో అదిరింది.

ఓవైపు సినిమాల‌తో పాటు మ‌రో వైపు హోస్ట్‌గానూ రాణిస్తున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

Unstoppable With NBK S4 Balakrishna Bobby Thaman episode Promo out now

ఓవైపు సినిమాల‌తో పాటు మ‌రో వైపు హోస్ట్‌గానూ రాణిస్తున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న హోస్ట్‌గా ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్‌. ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం నాలుగో సీజ‌న్ స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవ్వ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఎనిమిదో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది.

ఈ ఎపిసోడ్‌లో డాకు మ‌హారాజ్ టీమ్ సంద‌డి చేసింది. ద‌ర్శ‌కుడు బాబీ, నిర్మాత నాగ‌వంశీ, సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ అతిథులు వ‌చ్చారు. డాకు మ‌హారాజ్ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా వీరంతా ఈ షోలో పాల్గొన్నారు. మొద‌ట‌గా ద‌ర్శ‌కుడు బాబీకి బాల‌య్య స్వాగ‌తం ప‌లికారు.

Unstoppable with NBK S4 : అన్‌స్టాపబుల్‌ సెట్‌లో గేమ్‌ ఛేంజర్‌.. స్టైలిష్ లుక్‌లో రామ్‌చ‌ర‌ణ్‌..

ఆయ‌న రాగానే.. ఏంటి డైరెక్ట‌ర్ గారూ చొక్కా మీద చొక్కా వేశారు అంటూ త‌న‌దైన శైలిలో బాల‌య్య కామెడీతో అద‌ర‌గొట్టారు. బాబీకి ఆర్ ఆర్ చేయాలని ఉంద‌ని త‌మన్ అన్నారు. మొత్తంగా ప్రొమో అద‌రిపోయింది.

బాల‌య్య హీరోగా న‌టించిన డాకు మ‌హారాజ్‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ లు హీరోయిన్స్‌. బాబీ డియోల్ విల‌న్‌గా కనిపించ‌నున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం జ‌న‌వ‌రి 12 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Unstoppable with NBK S4 : అన్‌స్టాపబుల్‌ సెట్‌లో గేమ్‌ ఛేంజర్‌.. స్టైలిష్ లుక్‌లో రామ్‌చ‌ర‌ణ్‌..