Unstoppable with NBK Season 4 Allu Arjun episode gets record breaking views
Unstoppable With NBK : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2 డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేసారు పుష్ప 2 టీమ్. ఇందులో భాగంగానే టీజర్ ట్రైలర్ సైతం విడుదల చేసారు. తాజాగా చెన్నైలో మరో ఈవెంట్ సైతం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
Also Read : Pushpa 2 : పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్.. ఆ స్టార్ సింగర్స్ తో లైవ్ పర్ఫామెన్స్..
అయితే అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 4 కి వచ్చారు. అయితే అల్లు అర్జున్ అలాగే అయన పిల్లలు, తల్లి వచ్చిన ఈ షో ఎపిసోడ్ తాజాగా వ్యూయర్‌షిప్ రికార్డు బ్రేక్ చేసింది. రెండు ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ రాగా రెండో ఎపిసోడ్ లో ఆయన పిల్లలు తల్లి వచ్చారు. ఇప్పటి వరకు అన్‌స్టాపబుల్ లో ఏ ఎపిసోడ్ కి రానన్ని వ్యూస్ బన్నీ ఎపిసోడ్ కి వచ్చాయి. అల్లు అర్జున్ స్టార్డం అలాగే ఆయన పిల్లల అల్లరితో టాప్ వ్యూస్ అందుకుంది అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 4. పూర్తి నవ్వులు, లవ్ తో నిండిన ఈ ఎపిసోడ్ కి అర్హ కీలకం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన తెలుగు భాష, తెలుగు పద్యంతో ఈ షోకి మరింత ఎనర్జీ తెచ్చింది అర్హ. అర్హ పద్యాన్ని మెచ్చిన బాలయ్య ‘ అర్హ లాంటి పిల్లలు ఉండడం వల్ల తెలుగు ఇంకొన్ని కాలాల పాటు జీవిస్తుందని’ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి కూడా తెలిపారు బన్నీ. మంచి మనసున్న వ్యక్తిగా చిరుకి తను పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పాడు. అలాగే పుష్ప సినిమా కోసం తనెంత కష్టపడ్డాడో, ఇందులోని లేడీ గెటప్ కోసం ఎక్కువసేపు మేకప్ కోసం కూర్చోవడం ఎంత కష్టమో పంచుకున్నాడు. పుష్ప 2తో తనకున్న మరికొన్ని అనుభవాలను షేర్ చేసుకున్నాడు. ఈ షో ద్వారా అల్లు అర్జున్ మనసు ఎంత మంచిదో, ఇంత పెద్ద స్థాయికి వచ్చినా ఎంత ఒదిగి ఉంటారో తెలుస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్ రాకతో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 4 వ్యూయర్‌షిప్ రికార్డు బ్రేక్ అయ్యింది. మీరు కూడా బన్నీ చెప్పిన ఆ ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 4 చూసేయండి.