Pushpa 2 : పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్.. ఆ స్టార్ సింగర్స్ తో లైవ్ పర్ఫామెన్స్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.

Allu Arjun Pushpa 2 movie Wildfire Event Live Performance with those Star Singers
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట మొత్తం పుష్ప వైల్డ్ ఫైర్ హవానే నడుస్తుంది. ఇక ఇటీవల పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో ఎంత గ్రాండ్ గా చేసారు ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరంలేదు.
Also Read : Naga Chaitanya : ‘నాగచైతన్య బర్త్ డే’ మరింత స్పెషల్ చేసిన కర్నూల్ ఫాన్స్.. అనాధ పిల్లలకి ఫుడ్ పెడుతూ..
అయితే పుష్ప టీమ్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ప్రతీ ప్రమోషన్ కి కొత్తదనాన్ని చూపిస్తున్నారు. ఇక తాజాగా మరో ఈవెంట్ తో ఆడియన్స్ ముందు రావడానికి రెడీ గా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ట్రైలర్ ఈంట్ పాట్నాలో చెయ్యగా ఇప్పుడు చెన్నై లో ఓ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ రేపు (నవంబర్ 24)న సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ చెయ్యనున్నారు.
కాగా ఈ ఈవెంట్ లో ప్రముఖ సింగర్స్ లైవ్ పర్ఫామెన్స్ కూడా ఇవ్వనున్నారు. స్లుభాషిని రేపు విడుదల కానున్న కిస్సిక్, ఆండ్రియా జెరెమియా ఊ సోల్రియా మావా, రాజలక్ష్మి సామీ సామీ పాటలు పాడనున్నారు. ఇక ఈ పాటలు కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమాలోనివే. కాగా ఈ ఈవెంట్ కి మూవీ టీమ్ రానున్నారు. ఇప్పటికే పాట్నాలో చేసిన ఈవెంట్ కి లక్షల జనం వచ్చారు. మరి చెన్నైలో జరిగే ఈ ఈవెంట్ కి ఎంత జనం వస్తారో చూడాలి.