Upasana: నేను ఎవరి దయ వల్లా ఎదగలేదు.. మెగా కోడలు ఉపాసన సెన్సేషనల్ పోస్ట్

మెగా కోడలు ఉపాసన కొణిదెల(Upasana) సోషల్ మీడియాలో సెన్సేషనల్ పోస్ట్ చేశారు. ఎంతో భావోద్వేగంగా ఉన్న ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్

Upasana: నేను ఎవరి దయ వల్లా ఎదగలేదు.. మెగా కోడలు ఉపాసన సెన్సేషనల్ పోస్ట్

Upasana Konidela made a sensational post on Instagram

Updated On : August 26, 2025 / 7:44 AM IST

Upasana: మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో సెన్సేషనల్ పోస్ట్ చేశారు. ఎంతో భావోద్వేగంగా ఉన్న ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ అనే ఇంటరెస్టింగ్ థాట్ ను పంచుకున్న ఉపాసన(Upasana).. ఒక వ్యక్తిని నిజంగా గొప్పవాడు కావడానికి అవసరమయ్యే అంశం ఏమిటి? అని ప్రశ్నించారు. డబ్బు, కీర్తి, హోదా మాత్రమే ప్రమాణాలా? లేక భావోద్వేగ స్థిరత, ఇతరుల కోసంఆలోచించడం, సేవ చేయడం కూడా అంతే ముఖ్యమా? అనే అంశాన్ని విశ్లేషించారు.

Parineeti Chopra: తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. సోషల్‌ మీడియాలో స్పెషల్‌ పోస్ట్‌

“నేను ఎవరి దయ వల్లా ఎదగలేదు. ఒత్తిడిని, అణచివేతను ఎదుర్కొన్నాను, ఎన్నోసార్లు కిందపడ్డాను.. మళ్లీ లేచి ముందుసాగాను. నా మీద నాకే నమ్మకం! అసలైన బలం అనేది మన ఆత్మగౌరవంలో ఉంటుంది. దానికి డబ్బు, హోదా, ఫేమ్ తో సంబంధం లేదు. అహంకారానికి గుర్తింపు కావలి కానీ, ఆత్మగౌరవం ఎలాంటి శబ్దం అవసరం లేదు. అది స్వయంగా గుర్తింపును సంపాదించుకుంటుంది” అంటూ ఆమె చేసిన ఈ పోస్ట్ ఎంతో మందికి స్ఫూర్తిని అందిస్తున్నాయి. దాంతో ఆమె చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.