Site icon 10TV Telugu

Upasana : ఉపాస‌న‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క బాధ్య‌త‌లు.. సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మెగా కోడ‌లు

Upasana named co chair of Telangana Sports Hub

Upasana named co chair of Telangana Sports Hub

తెలంగాణ ప్ర‌భుత్వం.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసనకు కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్‌కు కో-ఛైర్మ‌న్‌గా ఉపాస‌న‌ను నియ‌మించింది. త‌న‌కు ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం ప‌ట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ కొత్తగా క్రీడా పాలసీని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ప‌బ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ కు ప్ర‌భుత్వం పెద్ద పీఠ వేసింది. ఇందులో భాగంగా క్రీడారంగాల్ని ప్రోత్సాహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవాళ్లతో ఓ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ని నియమించింది.

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స‌జ్ ఓన‌ర్ అయిన సంజీవ్‌ గొయెంకాను దీనికి ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. కో-ఛైర్మ‌న్‌గా ఉపాస‌న‌ను ఎంపిక చేశారు. ఈ క్ర‌మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉపాస‌న ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. సంజీవ్ గొయెంకాతో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం రావడం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు.

తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్ బోర్డు సభ్యులుగా సన్ టివీ నెట్‌వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరుల‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది.

Exit mobile version