Kiran Abbavaram : భార్య కంటే ముందు కిరణ్ అబ్బవరం లవ్ స్టోరీ.. రెండేళ్లు లవ్.. ఇంకో అమ్మాయితో కిస్.. ఎవరితో? ఎప్పుడు?

తాజాగా కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. (Kiran Abbavaram)

Kiran Abbavaram : భార్య కంటే ముందు కిరణ్ అబ్బవరం లవ్ స్టోరీ.. రెండేళ్లు లవ్.. ఇంకో అమ్మాయితో కిస్.. ఎవరితో? ఎప్పుడు?

Kiran Abbavaram

Updated On : October 10, 2025 / 7:27 AM IST

Kiran Abbavaram : టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తున్నాడు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం K ర్యాంప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇప్పుడు ఒక బాబు.(Kiran Abbavaram)

తాజాగా కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు.

Also Read : Sekhar Kammula : శేఖర్ కమ్ములకి నో చెప్పిన ఆ హీరోయిన్.. కట్ చేస్తే స్టార్ అయిన కమలినీ ముఖర్జీ..

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నేను ఇంటర్ వరకు బాయ్స్ స్కూల్, బాయ్స్ కాలేజీ. ఆ తర్వాత బిటెక్ లో జాయిన్ అయ్యాకే అమ్మాయిలు ఉన్నారు. బిటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన కొత్తలో అప్పటిదాకా అబ్బాయిల మధ్య చదివి ఒక్కసారిగా అమ్మాయిలు కనపడటంతో వాళ్ళని చూస్తున్నాను. అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఆమె కనపడిన మొదటి రోజే వెళ్లి ప్రపోజ్ చేశాను. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. రెండేళ్లు గట్టిగానే ట్రై చేశాను. వర్కౌట్ అవ్వక వదిలేసా. కానీ నేను వదిలేసాక ఆమెకు నా మీద ఇష్టం కలిగింది. కానీ అప్పుడు లవ్ చేసే మూడ్ లో లేను అందుకే నో చెప్పాను అని తెలిపాడు.

అలాగే తన ఫస్ట్ కిస్ గురించి మాట్లాడుతూ.. బిటెక్ థర్డ్ ఇయర్ లో వేరే అమ్మాయితో ఫస్ట్ కిస్ చేశాను అని తెలిపాడు. కాలేజీ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీలు ఏమి లేవు. ఆ తర్వాత రహస్య నా లైఫ్ లోకి వచ్చింది అని చెప్పుకొచ్చాడు.

Also Read : Sai Pallavi : సీత పాత్రకు ఈమెని రిజెక్ట్ చేసి.. సాయి పల్లవిని తీసుకున్నారట.. పాపం రామాయణం మిస్ అయింది..