Sekhar Kammula : శేఖర్ కమ్ములకి నో చెప్పిన ఆ హీరోయిన్.. కట్ చేస్తే స్టార్ అయిన కమలినీ ముఖర్జీ..
ఓ హీరోయిన్ శేఖర్ కమ్ముల సినిమా రిజెక్ట్ చేసిందట. (Sekhar Kammula)

Sekhar Kammula
Sekhar Kammula : సినీ పరిశ్రమలో ఒకరి ఛాన్సులు ఇంకొకరి దగ్గరకు వెళ్తూనే ఉంటాయి. ఇది సాధారణ విషయమే. ఒకరు చేయాల్సిన పాత్ర చివరకు ఇంకెవరో చేస్తారు. అలా ఓ హీరోయిన్ శేఖర్ కమ్ముల సినిమా రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడం వల్ల ఆ ఛాన్స్ కమిలిని ముఖర్జీకి వచ్చింది.(Sekhar Kammula)
ఇంతకీ శేఖర్ కమ్ముల సినిమాని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే సదా. జయం సినిమాతో తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న సదా అప్పట్లో హీరోయిన్ గా తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేసింది. శేఖర్ కమ్ముల ముందు ఆనంద్ సినిమా కథని సదా దగ్గరకు తీసుకెళ్లి చెప్పారు. అయితే సదా శేఖర్ కమ్ముల కొత్త డైరెక్టర్ అని ఆ సినిమాకు నో చెప్పిందట.
Also Read : Sai Pallavi : సీత పాత్రకు ఈమెని రిజెక్ట్ చేసి.. సాయి పల్లవిని తీసుకున్నారట.. పాపం రామాయణం మిస్ అయింది..
శేఖర్ కమ్ముల అప్పటికి కేవలం డాలర్ డ్రీమ్స్ అనే ఒక సినిమా చేసారు. అసలు ఆ సినిమా రిలీజయినట్టు కూడా అప్పట్లో ఎవరికీ తెలీదు. అందుకే చాలా మంది శేఖర్ కమ్ముల మొదటి సినిమా ఆనంద్ అనే అనుకుంటారు. సదా కూడా శేఖర్ కమ్ముల కొత్త డైరెక్టర్ అని నో చెప్పిందట ఆనంద్ సినిమాకు. కట్ చేస్తే ఆ ఛాన్స్ కమిలిని ముఖర్జీకి వచ్చింది. కమిలినీకి అదే మొదటి తెలుగు సినిమా.
2004 లో వచ్చిన ఆనంద్ సినిమా మంచి విజయం సాధించి కమిలినీకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చేలా చేసింది. అలా సదా నో చెప్పడంతో కమిలినీ తెలుగులో స్టార్ అయింది అప్పుడు. అలాగే సదా చంద్రముఖి సినిమాకి కూడా నో చెప్పిందట. చంద్రముఖి ఛాన్స్ వచ్చినప్పుడు సదా అపరిచితుడు సినిమా చేస్తుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక చంద్రముఖి సినిమాలో నయనతార చేసిన పాత్రని వదులుకుంది. ఆ సినిమా నయనతారకు బాగా కలిసొచ్చింది.
Also Read : Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ సరికొత్త రికార్డ్.. స్టార్ హీరోలందర్నీ వెనక్కి నెట్టేసి..