The Paradise: నాని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ‘ది ప్యారడైజ్’ మూవీ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. (The Paradise)కెరీర్ లో ఎప్పుడు లేనంత ఫామ్ లో ఉన్నాడు. ఆయన ఏది పట్టుకున్నా బంగారం అవుతోంది.

Nani's upcoming movie The Paradise will be postponed
The Paradise: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. కెరీర్ లో ఎప్పుడు లేనంత ఫామ్ లో ఉన్నాడు. ఆయన ఏది పట్టుకున్నా బంగారం అవుతోంది. ఇటీవల ఆయన నిర్మాతగా చేసిన కోర్ట్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతా కొత్త వాళ్ళతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆ తరువాత నాని హీరోగా వచ్చిన హిట్ 3 ఏకంగా రూ.100 కోట్లకు పైగా(The Paradise) గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నానిని పూర్తి వైలెంట్ గా సరికొత్త అవతారంలో చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు శైలేష్ కొలను.
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో క్యూట్ మూమెంట్.. తనూజకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్.. తనూజ ఏమందో తెలుసా?
ఇక ఈ సినిమా తరువాత మరోసారి సరికొత్త అవతారంలో నాని కనిపించబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో బ్లాక్ బస్టర్ దసరా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దాంతో, ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే నాని క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంది. రెండు జాడలు వేసుకొని ఫుల్ హిజ్రా లాగా కనిపిస్తున్నాడు. ఆయన క్యారక్టర్ పేరు కూడా ‘జడల్’ అంటూ రివీల్ చేశారు. ఇక డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో ఒక కీ రోల్ చేస్తున్నాడు. ఆయన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంది.
ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ముందుగా 2026 మర్చి 26న విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు. కానీ, తాజా సమాచారం మేరకు ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటంటే.. షూటింగ్ కాస్త లేట్ గా స్టార్ట్ అవడం, అలాగే కథలో కూడా చాలా మార్పులు చేశారట. దీనివల్ల షూటింగ్ కంప్లీట్ అవడానికి మరికాస్త సమయం పట్టేలా ఉందట. అందుకే, ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సినిమా మర్చి 27న సింగల్ గా విడుదల అయ్యే అవకాశం దక్కింది. ఇక ది ప్యారడైజ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.