Upasana : నేను వారసత్వాన్ని కొనసాగించాలని బిడ్డని కనడం లేదు.. ఉపాసన వైరల్ పోస్ట్!

మదర్స్ డే సందర్భంగా ఉపాసన తన బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తూ.. ఆమె తన బిడ్డని వారసత్వాన్ని కొనసాగించాలని ఉద్దేశంతో కనడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Upasana viral comments on her unborn child and ram charan legacy

Upasana – Ram Charan: రామ్ చరణ్, ఉపాసన తమ పెళ్లి అయిన 10 ఏళ్ళ తరువాత మొదటి బిడ్డ గురించి గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ వార్తతో మెగా ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ లో సంబరాలు చేసుకున్నారు. మరి కొన్ని నెలలో మెగా ఇంటలో బుల్లి అడుగు ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం నిండు గర్భవతిగా ఉన్న ఉపాసన ఇంటి వద్దే ఉంటూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ వస్తుంది. ఇక నేడు (మే 14) మదర్స్ డే కావడంతో తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ వేసింది. ఆ పోస్ట్ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Chiranjeevi – Pawan Kalyan : మెగా ఇంట మదర్స్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన చిరు.. పవన్ పిక్‌ని మాత్రం!

“సరైన సమయంలో నేను మాతృత్వాన్ని స్వీకరించినందుకు గర్వపడుతున్నాను. సమాజం కోసం లేదా మా వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో లేదా నా వివాహాన్ని బలోపేతం చేయాలనే కోరికతో.. నేను నా బిడ్డకు జన్మని ఇవ్వాలని అనుకోలేదు. నా బిడ్డకు ప్రేమ, సంరక్షణను అందించడానికి నేను మానసికంగా సిద్ధమైనప్పుడే జన్మనివ్వాలని నిర్ణయించుకున్నా” అంటూ ఉపాసన రాసుకొచ్చింది. తమ మొదటి బేబీ గురించి అనౌన్స్ చేయడానికి ముందు చరణ్ అండ్ ఉపాసన ఎన్నో విమర్శలు ఎదురుకుంది. వాటన్నిటికీ సమాధానం ఇచ్చేలా ఈ పోస్ట్ ఉండడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Ram Charan fans : ఉపాసన గురించి తప్పుగా మాట్లాడినందుకు అతన్ని చితక్కొట్టిన చరణ్ ఫ్యాన్స్..

కాగా ఆగష్టులో ఉపాసన డెలివరీ డేట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మెగా అభిమానులు వచ్చే బేబీ వారసుడా? వారసురాలా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బిడ్డ పుట్టాక రామ్ చరణ్ షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వనున్నాడట. తమ బేబీతో కొంతకాలం సమయం స్పెండ్ చేసిన తరువాతే మళ్ళీ షూటింగ్స్ పాల్గొనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం చరణ్ గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.