Upasana went to her mother home for delivery
Upasana : రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. ఈ ఏడాది మెగా పవర్ స్టార్ కి బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇతర హీరోలకు దక్కని అవకాశంతో.. పలు నేషనల్ వేదికలపై సినిమా పరిశ్రమ నుంచి ప్రాతినిధ్యం వ్యవహిరించే సదవకాశము దక్కించుకొని ముందు వరసలో నిలిచాడు. అన్నిటికంటే ముఖ్యం తను తండ్రి కాబోతున్నాడు అన్న శుభవార్త.
Ram Charan : తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఆనందంలో చిరు..
కాలేజీ నుంచి మంచి స్నేహితులైన ఉపాసన, రామ్ చరణ్ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా మెగా వారసుడు గురించి ఈ జంట ఏ శుభవార్త చెప్పకపోవడంతో, పలు ఇంటర్వ్యూలో ఉపాసనని ఈ విషయం గురించి ప్రశ్నించేవారు. అయితే వాటికే అప్పుడు తనదైన శైలిలో బదులిచ్చేది ఉపాసన. కాగా ఈ నెల 12న చరణ్ తండ్రి కాబోతున్నాడు అంటూ చిరంజీవి ప్రకటించిన దగ్గర నుంచి మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.
ఇక ఉపాసన డెలివరీ కోసం నిన్న పుట్టింటికి వెళ్ళింది. ‘నా లైఫ్ లో ఎంతో ముక్యమైన ఆడవాళ్ళ ఆశీర్వాదాలతో అమ్మతనంలోకి అడుగుపెడుతున్నా. మిస్ యూ అత్తమ్మ’ అంటూ చిరంజీవి సతీమణి సురేఖని ఉద్దేసిస్తూ పోస్ట్ చేసింది. పుట్టింట అమ్మ, తోబుట్టువులతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం మెగా, కామినేని కుటుంబంలో సంబరాలు నెలకొన్నాయి.