వాలెంటైన్స్ డే స్పెషల్ – యంగ్ హీరోల ప్రేమ కథలు

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగు ప్రేమకథా చిత్రాల విశేషాలు..

  • Published By: sekhar ,Published On : February 13, 2020 / 02:15 PM IST
వాలెంటైన్స్ డే స్పెషల్ – యంగ్ హీరోల ప్రేమ కథలు

Updated On : February 13, 2020 / 2:15 PM IST

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగు ప్రేమకథా చిత్రాల విశేషాలు..

‘ప్రేమ’.. రెండక్షరాల మాటే కానీ.. మనసుల్ని, మనుషుల్ని నడిపిస్తుంది. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్.. లవ్ లేనిదే లైఫ్ ఎక్కడుంది? అందుకే ప్రేమకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అందరూ. రిలేషన్ షిప్‌లో కంటిన్యూ అవ్వాలన్నా.. లైఫ్‌లో గెటాన్ అవ్వాలన్నా.. అన్నింటికీ కావల్సింది ప్రేమే. అందుకే సినిమాలకు ఆ ప్రేమే ఇంట్రెస్టింగ్ లైన్ అయింది. ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్ అయింది. అందుకే సీజన్ చూసుకుని మరీ వరుస లవ్ స్టోరీలతో రెడీ అవుతున్నారు హీరోలు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు పరిశ్రమలో రాబోతున్న ప్రేమకథా చిత్రాల విశేషాలు..
విజయ్ ప్రేమకథల కహానీ..
టాలీవుడ్‌లో ఈ మధ్య కమర్షియల్ సినిమాలు కాస్త సైడ్ అయ్యి వరుసగా లవ్ స్టోరీలే తెరకెక్కుతున్నాయి. విజయ్ దేవరకొండ.. ఇప్పటి వరకూ తను ఎలాంటి సినిమాలు చేసినా.. లవ్ స్టోరీస్‌నే ఇష్టపడ్డారు ఆడియన్స్. లవర్ బాయ్‌గానే చూడాలనుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అందరూ మెచ్చిన లవ్ స్టోరీతోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో నలుగురు హీరోయిన్లతో మాంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తో రెడీ అయ్యాడు. నలుగురు హీరోయిన్లతో, 4 లవ్ ట్రాక్స్ నడిపిస్తూ.. ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్న ఈ సినిమా వ్యాలెంటైన్స్ డే రోజే రిలీజ్ అవుతోంది.

vijay

ప్రేమకోసం భీష్ముడి పోరాటం..
నితిన్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ ‘భీష్మ’. (సింగిల్ ఫరెవర్) అనే క్యాప్షన్‌తో టైటిల్‌తోనే ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో లవ్ మాత్రం ఫుల్‌గా కనిపిస్తోంది. ప్రోమోస్‌లో అమ్మాయి వెంట పడుతూ.. ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు నితిన్.. ఈ సినిమాని ఫిబ్రవరి 21న రిలీజ్ చేస్తున్నారు.

nitin

శేఖర్ కమ్ముల స్వచ్ఛమైన ప్రేమ..
యాక్షన్, మాస్ హీరోగా ట్రై చేసినా పెద్దగా వర్కవుట్ కాని నాగచైతన్యను ఆడియన్స్ లవర్ బాయ్‌గానే ఇష్టపడుతున్నారు. అందుకే అదే జానర్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల్ని పలకరిచబోతున్నాడు. ఎక్స్ ప్రెషన్ క్వీన్ సాయిపల్లవి జోడీగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరే ‘లవ్ స్టోరీ’.  మరి నాగచైతన్య, సాయపల్లవిల ప్రేమ కథ చూడాలంటే ఏప్రిల్ 2 వరకూ ఆగాల్సిందే.

chaitu

సోలో అయినా తోడు కావాల్సిందే..
లవ్ స్టోరీలనే నమ్ముకున్న మరో హీరో సాయిధరమ్ తేజ్.. కూడా ఈ సారి మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ.. బ్యాచిలర్ టైటిల్ పెట్టినా.. కంటెంట్ మొత్తం ప్రేమకథే. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మే డే రోజు రిలీజ్ అవుతోంది. ఇలా ఆడియన్స్‌కి మంచి సీజన్‌లో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలను రెడీ చేసి రిలీజ్ చేస్తున్నారు హీరోలుచ దర్శక నిర్మాతలు. 
SD