Sahiba : విజయ్ దేవరకొండ ‘సాహిబా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘కాలానికి మించి- ఒక ప్రేమకథ ఎదురుచూస్తోంది’

సాహిబా అనే టైటిల్‌తో ఈ ఆల్భ‌మ్ రానుంది

Update from Vijay Deverakonda Sahiba

Sahiba : బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ జస్లీన్ రాయల్ గ‌తేడాది కంపోజ్ చేసిన హీరియే హీరియే సాంగ్ ఎంత‌టి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. తాజాగా ఆమె మ‌రో అద్భుత‌మైన సాంగ్ కంపోజ్ చేస్తోంది. సాహిబా అనే టైటిల్‌తో ఈ ఆల్భ‌మ్ రానుంది.

మేల్ లీడ్‌గా రౌడీ హీరో విజయ దేవరకొండ, ఫీమేల్ లీడ్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధికా మదన్ న‌టిస్తున్నట్లు ఇప్ప‌టికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఇక ఈ సాంగ్ ఎప్పుడెప్పుడూ వ‌స్తుందా అని అంద‌రూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Kamal Haasan : ‘న‌న్ను క‌మ‌ల్ అని పిల‌వండి చాలు.. ఉల‌గ‌నాయ‌గ‌న్, విశ్వ‌న‌టుడు అని పిల‌వొద్దు’ : క‌మ‌ల్‌హాస‌న్‌

తాజాగా ఇందుకు సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చింది. న‌వంబ‌ర్ 15న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మాటలకు అతీతంగా, కాలానికి మించి- ఒక ప్రేమకథ ఎదురుచూస్తోంది అంటూ రాసుకొచ్చింది.