Kamal Haasan : ‘నన్ను కమల్ అని పిలవండి చాలు.. ఉలగనాయగన్, విశ్వనటుడు అని పిలవొద్దు’ : కమల్‌హాసన్
సీనియర్ నటుడు, స్టార్ హీరో కమల్ హాసన్‌ను అభిమానులు ముద్దుగా ఉలగనాయగన్, విశ్వనటుడు అని పిలుచుకుంటూ ఉంటారు.

Kamal Haasan Declines All Titles And Prefixes Including Ulaganayagan
Kamal Haasan : సీనియర్ నటుడు, స్టార్ హీరో కమల్ హాసన్‌ను అభిమానులు ముద్దుగా ఉలగనాయగన్, విశ్వనటుడు అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే.. ఇకపై తనను ఇలాంటి ట్యాగ్స్‌తో పిలవొద్దని కమల్ హాసన్ కోరారు. తనను కమల్ లేదా కమల్ హాసన్ లేదా కెహెచ్ అని పిలవాలని సూచించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో కమల్ హాసన్ ఓ పోస్ట్ పెట్టారు.
తను చేసే పనిని మెచ్చి ఉలగనాయగన్ వంటి ఎన్నో బిరుదులు ఇచ్చినందుకు ఎల్లప్పుడు కృతజ్ఞతుడినని కమల్ హాసన్ చెప్పారు. ప్రేక్షకులు, తోటి నటీనటులు, ఆత్మీయుల నుంచి వచ్చే ఇలాంటి ప్రశంసలు తన మనసును తాకాయన్నారు. తననెంతగానో కదలించాయని చెప్పారు. సినిమా అనేది ఏ వ్యక్తి ఊహకి అందదన్నారు. తాను నిత్య విద్యారిని అని చెప్పారు. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింతగా ఎదగాలని ఆశీస్తున్నట్లు తెలిపారు.
Bigg Boss 8 : బిగ్ బాస్ నుంచి హరితేజ ఎలిమినేట్.. వాళ్లు మాస్క్‌లు తీస్తే బెటర్ అంటూ కామెంట్స్
కళ కంటే కళా కారుడు గొప్ప కాదు అన్నది తన అభిప్రాయన్నారు. తాను ఎప్పటికీ స్ధిరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తనలోని లోపాలు గుర్తించి మెరుగు పరుచుకుంటా.. నటుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
ఎంతో ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానని, స్టార్ ట్యాగ్‌ని మర్యాద పూర్వకంగా తిరస్కరిస్తున్నా అని వెల్లడించారు. అభిమానులు, సినీ ప్రముఖులు, భారతీయులంతా తనను కేవలం కమల్ హాస్ లేదా కమల్ లేదా కెహెచ్ గా పిలవాలని కోరుతున్నట్లు తెలిపారు. ‘నా మూలాలకు నేను కట్టుబడి ఉండాలని, నటుడిగా బాధ్యత నిర్తర్తించాలని అనుకుంటున్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.’ అని కమల్ హాసన్ అన్నారు.
కమల్ హాసన్ కంటే ముందు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కూడా తన ట్యాగ్‌ని తొలగించుకున్నారు. తనని కేవలం అజిత్ లేదా అజిత్‌కుమార్ లేదా ఏకే అని మాత్రమే పిలవాలని సూచించారు.
உங்கள் நான்,
கமல் ஹாசன். pic.twitter.com/OpJrnYS9g2
— Kamal Haasan (@ikamalhaasan) November 11, 2024