Bigg Boss 8 : బిగ్ బాస్ నుంచి హ‌రితేజ ఎలిమినేట్‌.. వాళ్లు మాస్క్‌లు తీస్తే బెట‌ర్ అంటూ కామెంట్స్‌

బిగ్‌బిస్ తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తిక‌రంగా సాగుతోంది.

Bigg Boss 8 : బిగ్ బాస్ నుంచి హ‌రితేజ ఎలిమినేట్‌.. వాళ్లు మాస్క్‌లు తీస్తే బెట‌ర్ అంటూ కామెంట్స్‌

Bigg Boss 8 Hari Teja eliminated in 10th week

Updated On : November 11, 2024 / 8:43 AM IST

బిగ్‌బిస్ తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ప‌దో వారం డ‌బుల్ ఎమినేష‌న్ జ‌రిగింది. అనారోగ్య కార‌ణాల‌తో గంగ‌వ్వ త‌నంత‌ట తానే హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఇక ఆడియ‌న్స్ ఓట్ల ప్ర‌కారం టైటిల్ ఫేవ‌రెట్‌లో ఒక‌రైన హ‌రితేజ ఎలిమినేట్ అయింది.

గౌతమ్, నిఖిల్, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ ప‌దో వారం నామినేషన్స్‌లో ఉన్నారు. గౌత‌మ్‌కు అత్య‌ధిక ఓట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌రువాత నిఖిల్, ప్రేర‌ణ‌, విష్ణుప్రియ‌, పృథ్వీ ఉన్నారు. ఇక డేంజ‌ర్ జోన్‌లో య‌ష్మి, హ‌రితేజ నిలిచారు. వీరిలో ఎవ‌రికైనా ఎవిక్ష‌న్ ఫీల్డ్ వాడాల‌ని అనుకుంటున్నావా అని న‌బీల్‌ను హోస్ట్ నాగార్జున అడిగారు. త‌న కోసం మాత్ర‌మే ఆ షీల్డ్ వాడుకుంటాన‌ని చెప్పాడు.

Varun Tej : నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోతే నీ సక్సెస్ పనికిరాదు.. వరుణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు కౌంటర్?

దీంతో ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న హరితేజ ఎలిమినేట్ అయినట్లు నాగ్ చెప్పాడు. అక్టోబ‌ర్ 6న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హ‌రితేజ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఐదు వారాలు హౌస్‌లో ఉంది ఎలిమినేట్ అనంత‌రం స్టేజీ పైకి వ‌చ్చి త‌న జ‌ర్నీ చూసుకుని ఎమోష‌న‌ల్ అయింది. ఎలిమినేట్ అయినా సంతోషంగానే ఉంద‌ని ఆమె చెప్పింది. త‌న పాప త‌న కోసం వేచి చూస్తుండ‌టమే అందుకు కార‌ణ‌మ‌ని అంది.

మాస్క్‌లు తీయాల్సింది ఎవ‌రు..?

హౌస్‌లో ఉన్న వాళ్ల‌లో ఎవ‌రు మాస్కులు తీసి ఆడాలో చెప్పాల‌ని నాగార్జున అడిగారు. అవినాష్‌, రోహిణి, టేస్టీ తేజ‌, ప్రేర‌ణ‌, నిఖిల్ అని మాస్క్‌లు తీసి ఆడాల‌ని హ‌రితేజ చెప్పింది.

Varun Tej – Lavanya Tripathi : భార్యతో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన వరుణ్ తేజ్.. వరుణ్ – లావణ్య క్యూట్ ఫొటోలు చూశారా?