Game Changer Teaser : గేమ్ ఛేంజర్ టీజర్ రికార్డ్.. 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయో తెలుసా?

మూవీ యూనిట్ గేమ్ ఛేంజర్ 24 గంటల వ్యూస్ ని అధికారికంగా ప్రకటించడంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Game Changer Teaser : గేమ్ ఛేంజర్ టీజర్ రికార్డ్.. 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయో తెలుసా?

Ram Charan Game Changer Movie Teaser Views in 24 Hours Details Here

Updated On : November 10, 2024 / 9:32 PM IST

Game Changer Teaser : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి నిన్న టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. లక్నోలో భారీ ఈవెంట్ పెట్టి, మూవీ యూనిట్ అంతా హాజరయి గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. ఇక మూడేళ్ళుగా ఈ సినిమా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే టీజర్ ఇచ్చారు.

Also Read : Kanguva Trailer : సూర్య ‘కంగువా’ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. రెండు పాత్రల్లో సూర్య అదరగొట్టాడుగా..

టీజర్ లో చాలా షాట్స్ చూపించి కేవలం రెండు, మూడు డైలాగ్స్ తోనే అదరగొట్టి ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను మెప్పించారు. నిన్నటి నుంచి గేమ్ ఛేంజర్ టీజర్ ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది. ఇక మూడు భాషల్లో టీజర్ రిలీజవ్వగా అన్ని భాషల్లో కలిపి గేమ్ ఛేంజర్ టీజర్ 24 గంటల్లో ఏకంగా 70 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సెట్ చేసింది.

Image

మూవీ యూనిట్ గేమ్ ఛేంజర్ 24 గంటల వ్యూస్ ని అధికారికంగా ప్రకటించడంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీజర్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉండటంతో రేపటికల్లా 100 మిలియన్ వ్యూస్ దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. టీజర్ తోనే రచ్చ సృష్టించిన గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్, సినిమాతో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. మరోసారి టీజర్ చూసేయండి..