Kanguva Trailer : సూర్య ‘కంగువా’ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. రెండు పాత్రల్లో సూర్య అదరగొట్టాడుగా..
మీరు కూడా కంగువా రిలీజ్ ట్రైలర్ చూసేయండి..

Suriya Kanguva Movie Release Trailer Released
Kanguva Trailer : తమిళ్ స్టార్ హీరో సూర్య ‘కంగువా’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో కంగువ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ రోల్ లో, దిశా పటాని హీరోయిన్ గా కనిపించబోతున్నారు. కంగువా సినిమా నవంబర్ 14న భారీగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ప్రస్తుత కథకు, పీరియాడిక్ కథకు లింక్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే పలు సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. తాజాగా కంగువా సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల చేసారు. మీరు కూడా కంగువా రిలీజ్ ట్రైలర్ చూసేయండి..
https://www.youtube.com/watch?v=eIl0QbO7GNM
ఇక ట్రైలర్ చూస్తుంటే రెండు కాలాలకు లింక్ చేసి ఉండే కథలా ఉంది. ఫుల్ యాక్షన్ సీన్స్ తో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉన్నట్టు అర్ధమవుతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్స్ లో కేవలం పీరియాడిక్ సూర్య సీన్స్ చూపించారు. మొదటిసారి పీరియాడిక్ తో పాటు ప్రస్తుత సూర్య సీన్స్ లింక్ చేస్తూ చూపించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.