Vijay Deverakonda : మెట్ల మీద జారి పడ్డ విజయ్.. ట్రోలర్స్ కి ఈ వీడియోతో గట్టి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

ఇటీవల విజయ్ ఓ ఈవెంట్ కి వెళ్లి వస్తూ మెట్ల మీద నుంచి దిగుతుంటే స్లిప్ అయి జారి పడ్డాడు.

Vijay Deverakonda : మెట్ల మీద జారి పడ్డ విజయ్.. ట్రోలర్స్ కి ఈ వీడియోతో గట్టి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

Vijay Deverakonda gives Counter to Trolls with a Stylish Edited Video

Updated On : November 10, 2024 / 8:57 PM IST

Vijay Deverakonda : అర్జున్ రెడ్డితో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తక్కువ టైంలోని అభిమానులను సంపాదించుకొని స్టార్ హీరో అయ్యాడు. కానీ వెంట వెంటనే ఫ్లాప్స్ రావడం, అతని యాటిట్యూడ్, యారగెంట్ గా మాట్లాడటంతో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ దారుణమైన ట్రోల్స్ చూసాడు. కొంతమంది అయితే విజయ్ ఎప్పుడు దొరుకుతాడా ట్రోల్ చేద్దామా అని ఉంటారని విజయ్ స్వయంగా చెప్పాడు.

అయితే ఇటీవల విజయ్ ఓ ఈవెంట్ కి వెళ్లి వస్తూ మెట్ల మీద నుంచి దిగుతుంటే స్లిప్ అయి జారి పడ్డాడు. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఇక ట్రోలర్స్ రెచ్చిపోయి విజయ్ దేవరకొండ పడ్డాడు, విజయ్ పడిపోయాడు, చూసి నడవమని.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేసారు. అయితే విజయ్ నేడు ఈ ట్రోల్స్ కి గట్టి సమాధానం ఇచ్చాడు.

Also Read : Arjun Kapoor : బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌కు హషిమోటో వ్యాధి.. దీని లక్షణాలేంటి? చికిత్స, నివారణ పద్దతులివే!

తాజాగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసాడు. తనకు రౌడీ అనే క్లాత్ బిజినెస్ ఉన్న సంగతి తెలిసిందే. మెట్ల మీద పడ్డ వీడియోకి కింద స్టైల్ గా పడుతున్నది జతచేసి ఒక వీడియో ఎడిట్ చేసాడు. ఆ వీడియోపై నేను పడుతూనే ఉంటాను ప్రేమలో నా రౌడీ బాయ్స్, గర్ల్స్ తో. రౌడీ వేర్ తో కూడా అందరూ ప్రేమలో పడతారు అంటూ ఒక యాడ్ వీడియోలా తయారుచేసాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక విజయ్ ఫ్యాన్స్.. ట్రోలింగ్ కంటెంట్ ని కూడా నీ ప్రమోషన్స్ కి వాడుకుంటున్నావుగా, ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు, వీడియో భలే ఎడిట్ చేసాడే అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి..

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)