Varun Tej : నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోతే నీ సక్సెస్ పనికిరాదు.. వరుణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు కౌంటర్?
నేడు మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో వరుణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Varun Tej Sensational Comments in Matka Pre Release Event goes Viral
Varun Tej : వరుణ్ తేజ్, మీనాక్షి జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మట్కా సినిమా నవంబర్ 14న రిలీజ్ కాబోతుంది. నేడు మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో వరుణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. సినిమా గురించి టెన్షన్ ఉంది. ఎంత బాగున్నా చిన్న భయం ఉంది. సినిమా గురించి నైట్ లావణ్యతో మాట్లాడి పడుకున్నాను. తెల్లారి చరణ్ అన్నయ్య కాల్ చేసాడు. అన్నయ్యతో మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది. నాకు ఎమోషనల్ గా అన్నయ్య చాలా సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్స్ చరణ్ అన్న. మా బాబాయ్, పెదనాన్న నా గుండెల్లో ఉంటారు. అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావు అని అడుగుతారు. మా బాబాయ్, మా పెదనాన్న, మా అన్నయ్య చరణ్ గురించి నేను మాట్లాడుతాను. అది నా ఇష్టం. లైఫ్ లో నువ్వు పెద్దోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చు. కానీ నువ్వు ఎందుకు, ఎక్కడ మొదలుపెట్టావు, నీ వెనక సపోర్ట్ ఎవరు ఇచ్చారు అని నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు. చిరంజీవి గారు, బాబాయ్ కళ్యాణ్ గారు, నాన్న, అన్నయ్య.. వాళ్ళు నా మసన్సులో ఉంటారు. వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు అని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇటీవల అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నాడని, అందుకే ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అని, ఇప్పుడు తన ఆర్మీ అంటున్నాడని, ఇటీవల వైసీపీ నేతకు ఎన్నికల్లో ప్రచారం చేయడం, మళ్ళీ దాని గురించి మాట్లాడటం.. ఇలాంటి వాటితో ఫ్యాన్స్ లో విభేదాలు నెలకొన్నాయి. మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు వరుణ్ ఇలా సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోతే ఇంక ఆ సక్సెస్ ఎందుకు పనికిరాదు అని మాట్లాడిన వ్యాఖ్యలు బన్నీకేనా, ఆ కామెంట్స్ ఇప్పుడు చేయడం ఎందుకు అని చర్చగా మారింది. నాగబాబు కూడా గతంలో బన్నీపై ఇండైరెక్ట్ గా ఒక ట్వీట్ వేసి డిలీట్ చేసారు. మరి ఇప్పుడు వరుణ్ తేజ్ వ్యాఖ్యలు బన్నీకి కౌంటరా? లేక మామూలుగానే అన్నారా ఆయనకే తెలియాలి. ఈ వ్యాఖ్యలపై బన్నీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.