ఏడు భాషల్లో రియల్ స్టార్ ఉపేంద్ర ‘కబ్జా’ : నవంబర్ 15న షూటింగ్ ప్రారంభం

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న ‘కబ్జా’ సినిమా ఏడు భాషల్లో తెరకెక్కుతుంది.. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది..

  • Published By: sekhar ,Published On : November 5, 2019 / 09:23 AM IST
ఏడు భాషల్లో రియల్ స్టార్ ఉపేంద్ర ‘కబ్జా’ : నవంబర్ 15న షూటింగ్ ప్రారంభం

Updated On : November 5, 2019 / 9:23 AM IST

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న ‘కబ్జా’ సినిమా ఏడు భాషల్లో తెరకెక్కుతుంది.. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది..

‘ఐ లవ్ యూ’ తర్వాత కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఆర్.చంద్రు దర్శకత్వంలో ‘కబ్జా’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. అండర్‌ వరల్డ్‌ మాఫియా నేపధ్యంలో ‘కబ్జా’ రూపొందనుంది. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

కన్నడ, తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ.. మొత్తం ఏడు భాషల్లో రూపొందనుంది. ఒక్కో లాంగ్వేజ్‌‌లో ఆయా పరిశ్రమలకు చెందిన నిర్మాతలే నిర్మించనున్నారని తెలుస్తోంది. అండర్ వరల్డ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగుతుందట..

Read Also : కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ షూటింగ్ పూర్తి

‘కబ్జా’లో ఉపేంద్ర ‘ఓం’ సినిమా తరహాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని చెప్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారని సమాచారం. హీరోయిన్‌తో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది..