రష్మిక ‘గాజర్ కా హల్వా’ ఎలా చేసిందో చూశారా!

Rashmika Mandanna: ఇటీవల urlife.co.in వెబ్ పోర్టల్‌ను ప్రారంభించి దాని ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఉపాసన వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సమంత గెస్ట్ ఎడిటర్‌గా హాజరై హెల్దీ అండ్ టేస్టీ రెసిపీలను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వెబ్ పోర్టల్‌కు ప్రముఖ కథానాయిక రష్మికా మందన్న గెస్ట్ ఎడిటర్‌గా హాజరైంది. తనకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను, పోషకాహార తయారీ వివరాలను ఉపాసనతో పంచుకుంది. అలాగే తనకు తెలిసిన గాజర్ కా హల్వా (Gajar ka Halwa) ను తయారు చేసి చూపించింది రష్మిక.
తన డైలీ మెను ఎలా ఉంటుంది.. వర్కౌట్స్ చేస్తూ కేలరీస్ బర్న్ చేయడం వంటి విషయాలు కూడా పంచుకుంది. రష్మిక చేసిన హల్వాను ఆమెకు తినిపించారు ఉపాసన. ఈ వీడియోలో గాజర్ కా హల్వా తయారీతో పాటు రష్మిక, ఉపాసనల కన్వర్జేషన్ కూడా ఆకట్టుకుంటోంది.