Urvashi Rautela: అవును.. మా బాలయ్య అలాంటోడే.. ఇంతకీ ఈ బాలీవుడ్ భామ ఏం చెప్పిందటే?
నందమూరి బాలకృష్ణ పై బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Urvashi Rautela interesting comments about Nandamuri Balakrishna
- బాలయ్య కోపం వెనుక పిల్లాడి మనస్తత్వం.
- అభిమానుల కోసమే ఆవేశపు దూకుడు.
- బాలయ్య పై ఊర్వశి రౌతేలా కామెంట్స్
Urvashi Rautela: నందమూరి బాలకృష్ణ స్క్రీన్ పై ఎంత పవర్ ఫుల్ గా కనిపిస్తారో, బయట కూడా అంతే దూకుడుగా ఉంటారు. ఇది, అందరికీ తెలిసిన విషయమే. అభిమానులపై చేయి చేసుకోవడం, వేదికలపై ఫోన్లను విసిరికొట్టడం వంటి ఘటనలు తరచూ వివాదాలకు దారితీస్తుంటాయి. దానిని, చాలా మంది తప్పుగా అనుకుంటారు, ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. కానీ, బాలయ్య ప్రవర్తన వెనుక ఉన్న అసలు కోణాన్ని నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) ఆసక్తికరంగా వివరించారు. బాలయ్య దూకుడు కేవలం కెమెరా ముందే కాదు, నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుందని, అయితే దాని వెనుక ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం దాగి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
Ntr: ‘బ్రహ్మోత్సవం’ మూవీ ఎన్టీఆర్ చేయాల్సింది.. చివరి నిమిషంలో ఎం జరిగింది.. తారక్ చేసుంటే?
బాలకృష్ణ అలా చేయడాన్ని జనం విమర్శించినా, ఆయన ఫ్యాన్స్ మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారని ఊర్వశి పేర్కొన్నారు. ఆయన కోపం వెనుక ఉన్న నిష్కల్మషమైన మనసు ఫ్యాన్స్‌కు బాగా తెలుసని, బాలయ్య చెంపదెబ్బలైనా, ఆవేశమైనా అది ఆయన నైజంలో భాగమని వారు భావిస్తారని చెప్పారు. షూటింగ్ సమయంలో ఆయన చూపించే ఉత్సాహం తోటి నటీనటులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని, ఆయన అలా ఉండటమే ప్రేక్షకులకు ఇష్టమని ఈ బాలీవుడ్ భామ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా బాలయ్యలోని సున్నితమైన కోణాన్ని కూడా ఊర్వశి వెల్లడించారు. గతేడాది వాలంటైన్స్ డే నాడు తనకు ఎవరూ విష్ చేయకపోయినా, బాలకృష్ణ మాత్రం ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పి సర్ప్రైజ్ చేశారని గుర్తు చేసుకున్నారు. సీనియర్ నటుడిగా ఆయన ఇచ్చే గౌరవం, పని పట్ల ఆయనకున్న అంకితభావం అభినందనీయమని ఊర్వశి కొనియాడారు. దీంతో ఈ అమ్మడుపై బాలయ్య ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
