Urvashi Rautela Shares a video with Balakrishna from Daku Maharaj Sets
Balakrishna – Urvashi Rautela : బాలకృష్ణ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో బాబీ దర్శకత్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. టీజర్లో బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్స్ చూసి బాలయ్య మరో హిట్ కొట్టబోతున్నట్టు అర్థమయిపోతుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా నటి, డ్యాన్సర్ ఊర్వశి రౌటేలా బాలయ్యతో మాట్లాడుతున్న ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో షూటింగ్ గ్యాప్ లో బాలయ్య, ఊర్వశి రౌటేలా కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు ఉంది. డాకు మహారాజ్ సెట్స్ నుంచి అని ఆ వీడియో పోస్ట్ చేసింది ఊర్వశి. దీంతో డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్ ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఊర్వశి రౌటేలా తెలుగులో ఏజెంట్, వాల్తేరు వీరయ్య, బ్రో, స్కంద.. సినిమాలలో ఐటెం సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించింది. ఇప్పుడు బాలయ్య పక్కన అలరించనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో బాలయ్య – ఊర్వశి రౌటేలా సాంగ్ ఉండనుందా, అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.