Actress iPhone: నీ ఫోన్ ఇప్పుడు నా దగ్గర ఉంది.. అది నీకు కావాలంటే..: హీరోయిన్‌కి మెయిల్

ఈ విషయాన్ని తెలుపుతూ ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది. ఆ వ్యక్తి చేసిన ఈ-మెయిల్ ఇదే..

Urvashi Rautela

Urvashi Rautela Shares Mail: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా(29)కు ఓ వ్యక్తి తాజాగా ఈ-మెయిల్ పంపాడు. ‘నీ ఫోన్ నా దగ్గర ఉంది. నీకు అది కావాలంటే.. నా సోదరుడు క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి నువ్వు నాకు సాయం చేయాలి’ అని ఈ-మెయిల్‌లో ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

ఈ విషయాన్ని తెలుపుతూ ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది. ఆ వ్యక్తి చేసిన ఈ-మెయిల్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా ఆమె అందులో చూపింది.


Urvashi Rautela Shares Mail From Person

ఊర్వశి రౌతేలా ఇటీవల తన 24 క్యారెట్స్ రియల్ గోల్డ్ ఐ ఫోన్ ను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. గుజరాత్, అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఇటీవల భార‌త్, పాకిస్థాన్ జ‌ట్ల మధ్య మ్యాచ్ ముగిశాక ఊర్వశి రౌతేలా ఓ ట్వీట్ చేసింది.

తాను మ్యాచ్ చూడడానికి వెళ్లానని, ఆ సమయంలో తన ఐ ఫోన్ పోయిందని చెప్పింది. ఫోన్ తిరిగి తన వచ్చేలా సాయం చేయండని కోరింది. ఎవ‌రికైనా దొరికితే వెంటనే తనకు తెలపాలని వేడుకుంది. ఫోను పోయిందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇప్పుడు ఓ వ్యక్తి నుంచి ఈ-మెయిల్ వచ్చింది. ఆమె పోగొట్టుకున్న ఫోను ఆమె వద్దకు వస్తుందో లేదో కానీ ఇటువంటి మెసేజ్ లు మాత్రం ఆమెకు ఫుల్లుగా వస్తున్నాయి. కాగా, టాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో ఊర్వశీ రౌతెల్లా అలరించింది.

ఇటీవల ఊర్వశి చేసిన ట్వీట్