Site icon 10TV Telugu

Prabhas : ప్రభాస్ సినిమాల నుంచి యూవీ అవుట్.. 3 మూవీలను సొంతం చేసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ!

UV Creations out from Prabhas projects and people media factory entered

UV Creations out from Prabhas projects and people media factory entered

Prabhas – UV Creations : ప్రభాస్ ప్రస్తుతం సలార్ (Salaar), ప్రాజెక్ట్ K (Project K), మారుతీ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో నటించనున్నాడు. ఇక ఆదిపురుష్ (Adipurush) సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూవీని తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి.

Bro : మామా అల్లుళ్ళ డబుల్ బొనాంజా ట్రీట్.. కొత్త పోస్టర్ రిలీజ్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని ఏకంగా 170 కోట్లకు పీపుల్ మీడియా కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అలాగే స్పిరిట్ తెలుగు రైట్స్ ని కూడా ఈ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని కూడా ఈ సంస్థే నిర్మిస్తుంది. అయితే ఈ వార్త పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఈ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే.. మూవీ టీం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటికే జై శ్రీరామ్ అనే సాంగ్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ‘రామ్ సీత రామ్’ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Balakrishna : ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి బాలయ్య ఎంట్రీ.. సినిమా కన్‌ఫార్మ్!

ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. గతంలో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్కడే నిర్వహించారు. దీంతో ఆ సెంటిమెంట్ ఆదిపురుష్ కి వర్క్ అవుట్ అవుతుందేమో అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆదిపురుష్, బాహుబలిలా ప్రేక్షకులను అలరించి ఆ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. అలాగే ఈ ఈవెంట్ కి గెస్ట్ లుగా ఎవరు రాబోతున్నారు అనే దాని పై ఆసక్తి నెలకుంది.

 

Exit mobile version