Vadde Naveen: వడ్డే నవీన్ ఏమైపోయాడు.. అసలు ఉన్నాడా అన్నారు.. టీజర్ ఈవెంట్ లో ఎమోషనల్ కామెంట్స్
తన గురించి సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ పై వడ్డే నవీన్(Vadde Naveen) ఎమోషనల్ గా మాట్లాడారు.
Vadde Naveen emotional speech at Transfer Trimurtulu Teaser Release Event
- వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా.
- ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టీజర్ విడుదల.
- పదేళ్ల తర్వాత భావోద్వేగ వ్యాఖ్యలు.
Vadde Naveen: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ దర్శకత్వంలో, రాశి సింగ్ కథానాయికగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న వడ్డే నవీన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు సినిమా ఇండస్ట్రీతో, ప్రేక్షకులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
Rashi Singh: ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రాశి సింగ్.. క్యూట్ ఫొటోలు వైరల్
ఈ సందర్భంగా వడ్డే నవీన్(Vadde Naveen) మాట్లాడుతూ.. తాను గత పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నానని, అయినప్పటికీ ప్రేక్షకులు, మీడియా తనను మర్చిపోకపోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ గ్యాప్‌లో తాను హైదరాబాద్‌లోనే తన కుటుంబంతో కలిసి గడిపానని స్పష్టం చేశారు. చాలా మంది ‘వడ్డే నవీన్ ఏమైపోయాడు? ఎక్కడున్నాడు?’ అని వెతికారని, కానీ తాను ఇక్కడే ఉన్నానని చెప్పారు. ఒకానొక దశలో అసలు సినిమాలు చేయకూడదని అనుకున్నట్లు ఆయన ఈ వేదికపై ఓపెన్‌గా వెల్లడించారు.
సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో తనకు చాలా ఆఫర్లు వచ్చాయని, కానీ సరైన, బలమైన కథ కోసం తాను వేచి చూశానని నవీన్ పేర్కొన్నారు. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ కథ విన్నాక, ఇది చాలా అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా అనిపించి ఓకే చెప్పానని వివరించారు. పదేళ్ల కాలం దాటినా తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు, తనను గుండెల్లో పెట్టుకున్న ప్రేక్షకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వడ్డే నవీన్ రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై ఆయన అభిమానుల్లో సరికొత్త అంచనాలు నెలకొన్నాయి.
