Vadde Naveen : చిరంజీవి సినిమా తెగ నచ్చేసింది.. రీ ఎంట్రీలో అలాంటి సినిమాలే కావాలంటున్న వడ్డే నవీన్..
వడ్డే నవీన్ ఇటీవల తనకు నచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. (Vadde Naveen)
- Saketh U
- Updated on- June 17, 2026 / 01:44 PM IST
Vadde Naveen
Vadde Naveen : ఒకప్పుడు ఫ్యామిలీ, లవ్ సినిమాలతో మెప్పించిన హీరో వడ్డే నవీన్ సడెన్ గా సినిమాలు ఆపేసారు. ఆల్మోస్ట్ 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ నేడు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇటీవల తనకు నచ్చిన సినిమాల గురించి మాట్లాడారు.
వడ్డే నవీన్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా నాకు బాగా నచ్చింది. నాకు కూడా అలాంటి సినిమాలు చేయాలని ఉంది. ఆయన స్థాయి నుంచి తగ్గి ఫ్యామిలీ, కామెడీతో ఆ సినిమా చేసారు. రీ ఎంట్రీ తర్వాత అలాంటి కథలు వస్తే చేస్తాను. హీరోగానే సినిమాలు చేస్తాను ప్రస్తుతానికి. మల్టీస్టారర్ అయితే చేస్తాను. అలాగే రంగస్థలం, పుష్ప సినిమాలు నచ్చాయి. ఇటీవల లిటిల్ హార్ట్స్ సినిమా చాలా బాగుంది. ఆ సినిమా బాగా నచ్చింది. కోర్ట్ సినిమా కూడా బాగుంది. నాని సినిమాలు బాగుంటాయి అని అన్నారు.
Also Read : Pawan Kalyan : అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. స్వయంగా వెళ్లి.. ఫొటోలు వైరల్..
వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తున్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా ఫ్యామిలీ, యాక్షన్, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కింది. మరి నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలాంటి కథలతో చేస్తారో చూడాలి.
