వజ్ర కవచధర గోవింద-టీజర్
వజ్ర కవచధర గోవింద టీజర్ రిలీజ్.

వజ్ర కవచధర గోవింద టీజర్ రిలీజ్.
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బి తర్వాత కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తున్న సినిమా, వజ్ర కవచధర గోవింద.. అరుణ్ పవార్ డైరెక్ట్ చేస్తుండగా, శివ శివమ్ ఫిలింస్ బ్యానర్‌పై, నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. వైభవీ జోషీ హీరోయిన్‌గా నటిస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. నేనో వలస పక్షిని, నాకంటూ ఓ గమ్యం లేదు అంటూ సప్తగిరి చెప్పే వాయిస్ ఓవర్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. టీజర్‌లో, రకరకాల గెటప్స్‌లో కనిపించాడు సప్తగిరి. అతను గోవింద్ అనే దొంగగా కనిపించబోతున్నాడు.
అర్చన ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాకి కథ : జీటీఆర్ మహేంద్ర, కెమెరా : ప్రవీణ్ వనమాలి, సంగీతం : బుల్ గనిన్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి, ఎడిటర్ : కిషోర్ మద్దాలి, స్టంట్స్ : స్టంట్స్ జాషువా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అరుణ్ పవార్.
వాచ్ టీజర్…