Bhagat Singh Nagar: తెలుగు, తమిళ్ భాషల్లో “భగత్ సింగ్ నగర్”
రమేష్ ఉడత్తు, హైదరాబాద్ నివాసి శ్రీమతి గౌరి వాలాజా సంయుక్తంగా గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్‌లో తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన సినిమా "భగత్‌సింగ్ నగర్".

Valaja Kranthis Bhagat Singh Nagar Movie First Look Releasing Soon
Bhagat Singh Nagar Movie: లండన్ పార్లమెంట్ హౌస్‌లో తెలుగువారి ఖ్యాతిని చాటుతూ ఉగాది సంబరాలను నిర్వహించిన విజయనగరవాసి రమేష్ ఉడత్తు, హైదరాబాద్ నివాసి శ్రీమతి గౌరి వాలాజా సంయుక్తంగా గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్‌లో తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన సినిమా “భగత్‌సింగ్ నగర్”. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ జులై 12వ తేదీన విడుదల చేయనుంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఓ ప్రముఖ వ్యక్తి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన దర్శకుడు వాలాజా క్రాంతి.. ప్రీ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించిందని, మంచి సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు, సోషల్ మీడియా స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భగత్ సింగ్ నగర్‌లో జరిగే అందమైన ప్రేమకథ.. వాస్తవపరిస్థితులను జోడిస్తూ.. యదార్థ సంఘటనలను కలుపుకుని అల్లుకున్న కథ ఇదని చెప్పుకొచ్చారు డైరెక్టర్ వాలాజా క్రాంతి.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనలకు కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లేతో తెరకెక్కించినట్లు వెల్లడించారు దర్శకులు.. ఈ సినిమాలో విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవిప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.