23 ఏళ్ళ వంశానికొక్కడు

1996 జనవరి 5న రిలీజ్ అయిన వంశానికొక్కడు, 2019 జనవరి 5వ తేదీ నాటికి, సక్సెస్‌ఫుల్‌గా, 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

  • Publish Date - January 5, 2019 / 08:11 AM IST

1996 జనవరి 5న రిలీజ్ అయిన వంశానికొక్కడు, 2019 జనవరి 5వ తేదీ నాటికి, సక్సెస్‌ఫుల్‌గా, 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

నందమూరి బాలకృష్ణ, రమ్యకృష్ణ, ఆమని హీరో, హీరోయిన్స్‌గా, శరత్ డైరెక్షన్‌లో, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై, శ్రీమతి అనితా కృష్ణ నిర్మించిన సినిమా.. వంశానికొక్కడు. 1996 జనవరి 5న రిలీజ్ అయిన వంశానికొక్కడు, 2019 జనవరి 5వ తేదీ నాటికి, సక్సెస్‌ఫుల్‌గా, 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి కథ, మాటలు రాసారు. వంశానికొక్కడులో, రాజాగా బాలయ్య నటనకు ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది.

రమ్యకృష్ణ, ఆమనిలతో పాటు, కైకాల సత్యనారాయణ, కోట, బ్రహ్మానందం, బాబూ మోహన్, తనికెళ్ళ భరణి, మల్లిఖార్జున రావు, జయంతి, అన్నపూర్ణ తదితరులు మిగతా క్యారెక్టర్స్‌లో నటించి మెప్పించగా, కోటి సంగీతమందించిన అబ్బదాని సోకు, ప్రియా మహాశయా, వలచి వలచి వాత్సాయనా, సరదాగా సమయం గడుపు, యబ్బా నీవాలుకళ్ళు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ : వి.ఎస్.ఆర్.స్వామి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, పాటలు : వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర, ఆర్ట్ : అశోక్, డ్యాన్స్ : తార, తరుణ్, డికెఎస్ బాబు, రాజు, ఫైట్స్ : విక్రమ్ ధర్మా.

వాచ్ యబ్బా నీవాలుకళ్ళు సాంగ్…

ట్రెండింగ్ వార్తలు