Vamshi Paidipally : మా మామయ్యకి క్యాన్సర్ వస్తే.. అందరూ చెప్పిన పేరు ఒకటే బసవతారకం హాస్పిటల్..

తాజాగా నేడు భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి వంశీ పైడిపల్లి కూడా రాగా ఈవెంట్లో మాట్లాడుతూ బసవతారకం హాస్పిటల్ గురించి చెప్పారు.

Vamshi Paidipally Speech in Bhagavanth Kesari Movie Trailer Launch Event

Vamshi Paidipally :  అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). బాల‌య్య‌కు జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal) న‌టిస్తోండ‌గా శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. థ‌మన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజాగా నేడు భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల, చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈవెంట్ కి బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది వచ్చి సందడి చేశారు. ఈ ఈవెంట్ కి వంశీ పైడిపల్లి కూడా రాగా ఈవెంట్లో మాట్లాడుతూ బసవతారకం హాస్పిటల్ గురించి చెప్పారు.

Also Read : Bhagavanth Kesari : భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్.. బిడ్డ ముందు తండ్రి నిలబడితే..

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. మా మామయ్యకి క్యాన్సర్ వస్తే హైదరాబాద్ లో నాకు తెలిసిన డాక్టర్స్ ఎవ్వరిని అడిగినా ఒకటే డాక్టర్ పేరు చెప్పారు. బసవతారకం హాస్పిటల్ లో డాక్టర్ సెంథిల్ రాజప్ప. అక్కడ హాస్పిటల్ ముందు వెళ్తూ ఉంటాను. అక్కడ బయట ఉన్న వాళ్లకి కొన్ని సార్లు భోజనం పెట్టాను. మొదటి సారి మా మామయ్యని తీసుకెళ్ళాను. ఆయనకు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ నా ఫ్రెండ్ ఒకతను పనిచేస్తున్నాడు, అతను రోజుకు వందమంది హాస్పిటల్ కి వస్తారు. దాదాపు 7, 8 సర్జరీలు చేస్తారు అని చెప్పాడు. సినిమాల కంటే కూడా ఎంతోమందికి ప్రాణం పోసిన మీరు, మీ పేరు ఎప్పుడూ గుర్తుండిపోతుంది మీ పేరు అని అన్నారు. దీంతో వంశీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19 దసరా కానుకగా రానుంది.