×
Ad

Varalaxmi Sarathkumar : దర్శక నిర్మాతగా మారిన నటి..

ఇన్నాళ్లు న‌టిగా ఉన్న వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ఇక ఇప్పుడు ద‌ర్శ‌కురాలిగానే కాకుండా నిర్మాత‌గానూ స‌త్తా చాటేందుకు సిద్ధ‌మైంది.

Varalaxmi Sarathkumar Announces Directorial Debut With Saraswathi

Varalaxmi Sarathkumar : తెలుగు ప్రేక్ష‌కుల‌కు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ను ప‌రిచ‌యం చేయాల్సి ప‌ని లేదు. క్రాక్, తెనాలి రామ‌కృష్ణ, వీరసింహారెడ్డి వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది. ఇన్నాళ్లు న‌టిగా ఉన్న ఆమె ఇక ఇప్పుడు ద‌ర్శ‌కురాలిగానే కాకుండా నిర్మాత‌గానూ స‌త్తా చాటేందుకు సిద్ధ‌మైంది.

శ‌నివారం (సెప్టెంబ‌ర్ 27న‌) తాను డైరెక్ట్ చేయ‌బోయే సినిమాకు సంబంధించి అఫీషియ‌ర్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని త‌న సోద‌రి పూజాతో క‌లిసి నిర్మిస్తోంది. అందుకోసం దోస డైరీస్‌ను బ్యానర్ ను ప్రారంభించారు. ఇక చిత్రానికి ‘స‌ర‌స్వ‌తి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో ‘SARASWATHI‘ (సరస్వతి) ఐ ను హైలెట్ చేయ‌డం అంద‌రిలో ఆస‌క్తిని పెంచుకుంది.

The Paradise : నాని ‘ది ప్యార‌డైజ్‌’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. స్ట‌న్నింగ్ లుక్‌లో మోహ‌న్ బాబు

ఈ మూవీలో వ‌ర‌ల‌క్ష్మి (Varalaxmi Sarathkumar ) ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తోంది. ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలను వెల్ల‌డించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.