The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. స్టన్నింగ్ లుక్‌లో మోహన్ బాబు
నాని హీరోగా నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్ (The Paradise) నుంచి మోహన్ బాబు లుక్‌ను విడుదల చేశారు.

Mohan Babu first look from Nani The Paradise movie
The Paradise : నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్ (The Paradise). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
తాజాగా చిత్ర బృందం మోహన్ బాబు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. షర్ట్ లేకుండా కత్తి పై చేయిపెట్టుకుని సిగరేట్ కాలుస్తూ ఉన్న మోహన్ బాబు లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ కానుంది. 1980ల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.