Mohan Babu first look from Nani The Paradise movie
The Paradise : నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్ (The Paradise). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
తాజాగా చిత్ర బృందం మోహన్ బాబు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. షర్ట్ లేకుండా కత్తి పై చేయిపెట్టుకుని సిగరేట్ కాలుస్తూ ఉన్న మోహన్ బాబు లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ కానుంది. 1980ల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.