Thamma Trailer: మోస్ట్ అవైటెడ్ థామా ట్రైలర్ వచ్చేసింది.. వాంపైర్ గా అదరగొట్టేసిన ఆయుష్మాన్.. రష్మిక కూడానా!

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ నుంచి మస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ (Thamma Trailer)మూవీ థామా. హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Thamma Trailer: మోస్ట్ అవైటెడ్ థామా ట్రైలర్ వచ్చేసింది.. వాంపైర్ గా అదరగొట్టేసిన ఆయుష్మాన్.. రష్మిక కూడానా!

Rashmika Mandanna Thamma trailer released

Updated On : September 26, 2025 / 9:22 PM IST

Thamma Trailer: ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ నుంచి మస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ థామా. హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి కారణం ఈ సంస్థలో వచ్చిన గత చిత్రాలు భేదియా, మూంజ్యా, స్త్రీ సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించడమే. అదే కోవలో ఈ సినిమాపై కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆయుశ్మాన్ ఖురానా, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sai Pallavi: సాయి పల్లవికి అరుదైన గౌరవం.. ప్రముఖుల జాబితాలో నటికి చోటు

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా థామా ట్రైలర్(Thamma Trailer) విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉంది. భేదియా, ముంజ్య సినిమాలను కలుపుతూ థామా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వందల ఏళ్ళ క్రితం యక్షసన్ అనే ఒక వాంపైర్ ఉంటాడు. అతను ఒక దగ్గర బంధించడబడతాడు. అతనిని హీరో కలవడంతో హీరోకి ఆ వాంపైర్ లక్షణాలు వస్తాయి. దాంతో, తెలియకుండానే కొన్ని దుష్ట శక్తులతో పోరాటం చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఎలిమెంట్స్ తో ట్రైలర్ ని కట్ చేశారు. ఇక థామాగా నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆయుష్మాన్, రష్మిక ట్రైలర్ లో కనిపించారు. ఇక హీరో తండ్రిగా పరేష్ రావల్ కామెడీ సినిమాకు హైలైట్ గా నిలవనుందని క్లియర్ అర్థమవుతోంది. అని రకాల ఎలిమెంట్స్ ని యాడ్ చేసి ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో ప్రస్తుతం ఈ ట్రయిలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.