Sai Pallavi: సాయి పల్లవికి అరుదైన గౌరవం.. ప్రముఖుల జాబితాలో నటికి చోటు
మలయాళ నటి సాయి పల్లవికి మరో అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు ప్రభుత్వం(Sai Pallavi) ఏటా అందించే కళైమామణి పురస్కారాలకు ఆమె ఎంపిక అయ్యింది.

Tamil Nadu government announces Kalaimamani Award for Sai Pallavi
Sai Pallavi: మలయాళ నటి సాయి పల్లవికి మరో అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు ప్రభుత్వం ఏటా అందించే (Sai Pallavi)కళైమామణి పురస్కారాలకు ఆమె ఎంపిక అయ్యింది. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను నటి సాయి పల్లవికి ఈ అవార్డు వరించింది. సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం సాయి పల్లవికి ఈ అవార్డును అందించనుంది.
తమిళనాడు ప్రభుత్వం ప్రతీ ఏటా కళైమామణి పురస్కారాలకు అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకు గానూ ఈ పురస్కార విజేతలను ప్రకటించింది. ఇందులో భాగంగానే సాయి పల్లవికి అవార్డు వరించింది. ఇంకా ఈ లిస్టులో.. దర్శకులు ఎస్.జె. సూర్య, లింగుసామి, నటులు మణికందన్, విక్రమ్ ప్రభు లాంటి వారు ఉన్నారు. ఇక సంగీతం, సాహిత్యం, సినిమా, నాటక వంటి రంగాల్లో విశేషమైన సేవలు అందించిన వారిని గౌరవించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏటా ఈ అవార్డులను అందజేస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నత పౌర పురస్కారాలలో ఒకటైన కళైమామణి అవార్డు కింద విజేతలకు మూడు సవర్ల బంగారు పతకం, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.