Anupama Parameswaran: మంచి సినిమాలు చేస్తే మీకు నచ్చదు.. మళ్ళీ అవే అడుగుతారు.. సీరియస్ అయిన యంగ్ బ్యూటీ

మీరు అలాంటి పాత్ర చేయడం నేను జీర్ణించుకోలేకపోతున్నా అంటూ ఒక జర్నలిస్ట్ (Anupama Parameswaran)అడిగిన ప్రశ్నకు సీరియస్ అయ్యింది ఓ యంగ్ బ్యూటీ.

Anupama Parameswaran: మంచి సినిమాలు చేస్తే మీకు నచ్చదు.. మళ్ళీ అవే అడుగుతారు.. సీరియస్ అయిన యంగ్ బ్యూటీ

Anupama Parameswaran gave a stunning performance to a journalist

Updated On : September 26, 2025 / 8:32 PM IST

Anupama Parameswaran: మీరు అలాంటి పాత్ర చేయడం నేను జీర్ణించుకోలేకపోతున్నా అంటూ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సీరియస్ అయ్యింది ఓ యంగ్ బ్యూటీ. మీకు మంచి సినిమాలు చేస్తే నచ్చవ్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. దాంతో ఆ జర్నలిస్ట్ కాస్త అవాక్కయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ యంగ్ బ్యూటీ మరెవరో కాదు మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఇటీవల ఈ బ్యూటీ (Anupama Parameswaran)నటించిన కిష్కింధకాండ సినిమా విడువులైన విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.

Charan-Sujeeth: రామ్ చరణ్ తో ఓజీ డైరెక్టర్ మూవీ.. కథ సిద్ధం.. అసలు ఎందుకు మిస్ చేశావ్ భయ్యా!

మొదటిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న అనుపమ. ఇందులో భాగంగానే మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో ఒక విలేఖరి.. “మీరు టిల్లు స్క్వైర్ లాంటి సినిమాల్లో నటించడం నేను జీర్ణించుకోలేకపోతున్న” అంటూ అనుపమను ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఆ ప్రశ్నకి అసహనానికి గురైన ఈ బ్యూటీ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ” మొన్న నేను పరదా అనే ఒక ఫీల్ గుడ్ సినిమా చేశాను. మీరు చూశారా? ఈ సినిమా చూస్తే మీరు హ్యాపీ ఫీలయ్యేవారు. కానీ, మీరు చూడలేదు. అందుకే మూవీ వర్క్అవుట్ కాలేదు. దీని గురించి ఎవ్వరూ మాట్లాడారు. మంచి సినిమా చేస్తే మీరు చూడరు కానీ, టిల్లు స్క్వేర్ లో చేస్తే డైజెస్ట్ చేసుకోలేకపోయారా” అంటారు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.