Charan-Sujeeth: రామ్ చరణ్ తో ఓజీ డైరెక్టర్ మూవీ.. కథ సిద్ధం.. అసలు ఎందుకు మిస్ చేశావ్ భయ్యా!
ఓజీ సినిమాతో మెగా ఫ్యాన్స్ ఆకలిని తీర్చాడు డైరెక్టర్ సుజీత్. (Charan-Sujeeth)పవన్ కళ్యాణ్ ను పవర్ ప్యాకుడ్ రోల్ లో చూపించి అదరగొట్టేశాడు ఈ కుర్ర దర్శకుడు. దాంతో, సుజీత్ పై ఎనలేని ప్రేమను కురిపిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

OG director Sujeeth makes crazy comments about the film with Ram Charan
Charan-Sujeeth: ఓజీ సినిమాతో మెగా ఫ్యాన్స్ ఆకలిని తీర్చాడు డైరెక్టర్ సుజీత్. పవన్ కళ్యాణ్ ను పవర్ ప్యాకుడ్ రోల్ లో చూపించి అదరగొట్టేశాడు ఈ కుర్ర దర్శకుడు. దాంతో, సుజీత్ పై ఎనలేని ప్రేమను కురిపిస్తున్నారు మెగా ఫ్యాన్స్. దాదాపు పన్నెండేళ్ల కోరికను తీర్చాడు అంటూ నెత్తినపెట్టేసుకుంటున్నారు. ఇక ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. మొదటిరోజు ఏకంగా రూ.154 కోట్లకు పైగా వసూళ్లు (Charan-Sujeeth)సాధించి ఈ ఇయర్ లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, చిత్ర యూనిట్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సుజీత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సాహో సినిమా తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను ప్లాన్ చేశాడట సుజీత్. లండన్ బ్యాక్డ్రాప్ లో జరిగే ఈ కథ రామ్ చరణ్ కి కూడా చాలా నచ్చిందట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చిందట. కానీ, అఫీషియల్ అనౌన్సమెంట్ చేసే సమయానికి అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయిందట. ఆ తరువాత బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట, కానీ.. ఆ ప్రెజెక్టు వదులుకొని ఓజీ సినిమా చేశానని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు.
ఈ కామెంట్స్ విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. సాహో సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయ్యుండొచ్చు కానీ, సుజీత్ టేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అలాంటి దర్శకుడు రామ్ చరణ్ తో సినిమా చేసి ఉంటే అదిరిపోయేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఎందుకు చేయలేదు భయ్యా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ కథ రెడీ అయితే రామ్ చరణ్ తో మూవీ చేసేయ్ అన్నా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి, రామ్ చరణ్-సుజీత్ కాంబోలో సినిమా వస్తుందా అనేది చూడాలి. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.