Varalaxmi Sarathkumar : సంక్రాంతికి వరలక్ష్మి వచ్చిందంటే.. హీరోలకు హిట్టు దొరికినట్లే..

సంక్రాంతికి వరలక్ష్మి వచ్చిందంటే హీరోలకు హిట్టు దొరికినట్లే అన్నట్లుగా మారిపోయింది. రవితేజ, బాలకృష్ణ, ఇప్పుడు తేజ సజ్జ..

Varalaxmi Sarathkumar bags a hit in every sankranti race and this time Hanuman Movie

Varalaxmi Sarathkumar : సీనియర్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి ‘వరలక్ష్మి’.
తమిళ్, తెలుగు భాషలతో పాటు సౌత్ లోని ఇతర సినిమాలో కూడా మెయిన్ రోల్స్, విలన్ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో వరలక్ష్మికి మంచి ఇమేజ్ ఉంది. ఈమె ఒక సినిమాలో చేస్తుందంటే.. అది బలమైన పాత్ర, సినిమాకి బలమయ్యే పాత్ర అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యిపోతారు.

తాజాగా వరలక్ష్మి ‘హనుమాన్’ సినిమాలో హీరో అక్క పాత్రని పోషించారు. సినిమాలో ఈ పాత్ర పవర్ ఫుల్ గానే ఉంటుంది. తమ్ముడి కోసం పోరాడానికి కూడా సిద్దపడే అక్క పాత్రలో వరలక్ష్మి విజుల్స్ అందుకున్నారు. ఈ సంక్రాంతి బరిలో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. కాగా వరలక్ష్మి నటించిన సినిమా సంక్రాంతికి వస్తే అది కచ్చితంగా విజయం అందుకోవాల్సిందే.

గత ఏడాది బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతికి రిలీజయ్యి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వరలక్ష్మి బాలకృష్ణ సోదరిగా బలమైన పాత్రలో నటించారు. అన్న పై ప్రేమని, పగని చూపిస్తూ రెండు షేడ్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. ఆ సినిమాకి వరలక్ష్మి పాత్ర మెయిన్ హైలైట్ అయ్యింది. అసలు కథ కూడా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మలినేని గోపీచంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

Also read : Aamir Khan : ఆమిర్ ఖాన్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌లో.. బాలీవుడ్ సెలబ్రిటీస్‌తో నాగచైతన్య..

ఇక ఇదే దర్శకుడు డైరెక్షన్ లో 2021 సంక్రాంతికి వచ్చిన సినిమా ‘క్రాక్’. రవితేజ కెరీర్ ని ఈ చిత్రం మళ్ళీ ట్రాక్ ఎక్కించింది. మాస్ మహారాజ్ అభిమానులకు మర్చిపోలేని కిక్ అందించింది. ఈ సినిమాలు కూడా వరలక్ష్మి బలమైన పాత్రని పోషించారు. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో. విలన్ రోల్స్ పోషించిన సముద్రఖని, వరలక్ష్మి పాత్రలు కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి.

ఇలా వరలక్ష్మి నటించిన సినిమా సంక్రాంతికి వస్తుంటే చాలు విజయం కావాల్సిందే అన్నట్లు మారింది. ఆయా హీరోల అభిమానులు కూడా వరలక్ష్మిని లక్కీ చామ్ గా భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం హనుమాన్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. అమెరికాలో 1M మార్క్ ని సొంతం చేసేసుకుంది.