Varalaxmi Sarathkumar wants to act only lady villain and charachter artist roles
Varalaxmi Sarathkumar : శరత్ కుమార్ కూతురిగా, హీరోయిన్ గా తమిళ పరిశ్రమలో పోడా పోడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏమనుకుందో ఏమో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రలకి షిఫ్ట్ అయిపొయింది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు, తమిళ్, మలయాళ సినీ పరిశ్రమలలో మోస్ట్ వాంటెడ్ లేడీ విలన్. అనేక సినిమాల్లో లేడీ విలన్ క్యారెక్టర్స్ తో అలరిస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది.
Vijay Son : తమిళ స్టార్ హీరో తనయుడు డైరెక్టర్ అవుతాడట.. మొదట డైరెక్ట్ చేసేది ఎవర్నో తెలుసా??
ఈ సంక్రాంతికి రాబోయే వీరసింహారెడ్డి సినిమాలో కూడా లేడీ విలన్ గా నటిస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎందుకు అన్ని విలన్ పాత్రలు చేస్తున్నారు అని అడగగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. నాకు గ్లామర్ పాత్రలు అసలు సెట్ అవ్వవు. అయినా అలాంటి గ్లామర్ పాత్రలు చేయడానికి చాలామంది ఉన్నారు. నాలాగా ప్రతినాయకి పాత్రలు చేయడానికి ఎవరూ లేరు. ఇలాంటి పాత్రలు నేనే చేయగలను అని అందరూ నమ్మి నాకు అవకాశాలు ఇస్తున్నారు. ఇలాంటి విలన్ పాత్రల్లో నటిస్తుంటే నాకు సంతృప్తిగానే ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాను అని తెలిపింది.