Varsha Dsouza Special Appearance in Vijay Deverakonda Family Star Movie Promotions
Varsha Dsouza : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నా సినిమాలో కొంత ల్యాగ్ ఉండటంతో కొంతమంది కనెక్ట్ అవ్వట్లేదు.
ఈ సినిమాలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. విజయ్ దేవరకొండకి వదినలుగా హీరోయిన్ అభినయ, సీనియర్ నటి వాసుకి నటించడం గమనార్హం. ఆఫీస్ లో కొలీగ్ పాత్రలో నటించడానికి హీరోయిన్ దివ్యంశ కౌశిక్ ని తీసుకొచ్చారు. కొన్ని సీన్స్ లో ఈమె అలరిస్తుంది. రష్మిక స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఉంటుంది అన్నారు కానీ అలాంటిదేమి లేదు. ఇక ఈ సినిమాలో ప్రముఖ యూట్యూబర్ వర్ష డిసౌజా కూడా మెరిపించింది.
Also Read : Family Star Review : ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిందా?
షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో వర్ష డిసౌజా యూట్యూబ్ లో బాగా పాపులర్ అయింది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ యూట్యూబ్ భామ ఫ్యామిలీ స్టార్ సినిమాలో కొద్దిసేపు మెరిపించింది. ఫ్యామిలీ స్టార్ సినిమా ఓపెనింగ్ లోనే హీరోని చూసి ఇష్టపడే అమ్మాయిగా, హీరోని సరదాగా ఆటపట్టించే అమ్మాయిల్లో ఒకరిగా వర్ష డిసౌజా నటించింది. ఆ ఒక్క సీన్ లోనే కొంతసేపు అలరించింది వర్ష. తెరపై వర్షని చూసి ఆమెని గుర్తుపట్టి మొత్తానికి సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది వర్ష అని ఆమె ఫాలోవర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయేమో, యూట్యూబ్ నుంచి వెండితెరపైకి పూర్తిగా షిఫ్ట్ అయితే బాగుండు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.