Varun Dhavan : అతనే నాకు సర్వస్వం.. డ్రైవర్‌పై వరుణ్ ధావన్ ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ విషాదంలో మునిగిపోయాడు. వరుణ్‌ ధావన్‌ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ నిన్న బుధవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. బాంద్రాలోని మెహబూబ్‌ స్డూడియోలో.....

Varun Dhavan

Varun Dhavan :  బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ విషాదంలో మునిగిపోయాడు. వరుణ్‌ ధావన్‌ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ నిన్న బుధవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. బాంద్రాలోని మెహబూబ్‌ స్డూడియోలో సినిమా షూటింగ్‌ జరుగుతుండగా వరుణ్‌ డ్రైవర్‌ మనోజ్ సాహు గుండెపోటుకి గురయ్యాడు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతని మరణం విని వరుణ్‌ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

మనోజ్ సాహు మరణంపై తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు వరుణ్ ధావన్. ”26 ఏళ్లుగా మనోజ్‌ నాతో ఉన్నాడు. అతనే నాకు సర్వస్వం. నా బాధను తెలిపేందుకు నా దగ్గర పదాలు లేవు. కానీ నాకు కావాల్సింది అతని అద్భుతమైన తెలివి, హాస్య చతురత, జీవితం పట్ల అతనికున్న అభిరుచిని ప్రజలు గుర్తుంచుకోవడమే. నువ్‌ నా జీవితంలో నాతో ఉన్నందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను మనోజ్‌ దాదా” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. ఆ తర్వాత అతని అంతక్రియలు కూడా దగ్గరుండి జరిపించాడు వరుణ్ ధావన్.

Nikki Galrani : ప్రముఖ హీరోయిన్ ఇంట్లో చోరీ.. పోలీసులకి ఫిర్యాదు..

ఈ పోస్ట్ కి గతంలో మనోజ్ గురించి ఓ స్టేజిపై మాట్లాడిన వీడియోని కూడా జత చేశాడు. ఆ వీడియోలో కూడా వరుణ్ స్టేజిపై మనోజ్ గురించి గొప్పగా చెప్పాడు. ఒక డ్రైవర్ ని ఇంట్లో వ్యక్తిలా చూసుకోవడమే కాక అతనికి స్టేజిపై గౌరవం ఇవ్వడం, అతని మరణం తర్వాత ఇలా స్పందించడంతో వరుణ్ ధావన్ ని అభిమానులు, నెటిజన్లు పొగిడేస్తున్నారు.