Varun Dhavan : సమంతకి బాడీగార్డ్‌గా బాలీవుడ్ హీరో..

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ తో కలిసి సమంత తొలిసారి నటించనుంది. ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్‌ 'సిటడెల్‌'కు ఇండియన్‌ వెర్షన్‌లో ఓ సిరీస్‌ను నిర్మించనున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్....

Samantha (1)

Samantha :  ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు ఓకే చేసింది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది సమంత. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ తో కలిసి సమంత తొలిసారి నటించనుంది. ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’కు ఇండియన్‌ వెర్షన్‌లో ఓ సిరీస్‌ను నిర్మించనున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ డైరెక్టర్స్ రాజ్‌ అండ్‌ డీకేలు దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిన సమంత ఇప్పుడు ‘సిటడెల్‌’తో మరింత పాపులర్ అవ్వనుంది. ‘సిటడెల్‌’ వెబ్‌సిరీస్‌ లో వరుణ్, సమంత కలిసి నటించనున్నారు.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌ టీం గత రాత్రి ముంబైలో సమావేశమాయ్యారు. ఈ మీటింగ్ కి సమంత కూడా హాజరైంది. అయితే మీటింగ్ అనంతరం సమంత, వరుణ్‌ ధావన్ తిరిగి వెళ్లిపోతున్న సందర్భంలో ఫోటో, వీడియో జర్నలిస్టులు హడావిడి చేశారు. ఫోటోల కోసం, వీడియో బైట్స్ కోసం సమంతని చుట్టుముట్టేశారు. ఇలా అందరు ఒకేసారి సమంతని చుట్టుముట్టేయడంతో ఆ జర్నలిస్టుల నుంచి వరుణ్‌ ధావన్ సమంతను తప్పించి ముందుకి నడిపించారు.

Gauri Khan : షారుఖ్‌తో విడిపోయి మళ్ళీ కలిసాను..

ఆ సమయంలో సమంతకి వరుణ్ బాడీగార్డ్ గా వ్యవహరించారు. అలాగే జర్నలిస్టులతో వరుణ్..’ఎందుకు అలా ఆమెను భయపెడతున్నారు? భయపెట్టకండి’ అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. సమంతను దగ్గరుండి కారు ఎక్కించాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.