Bhediya: గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ లో మరో కాంతారా కాబోతుందా “భేదియా” చిత్రం..

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దాదాపు ఫుల్ షోస్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఇప్పుడు మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

Varun Dhawan Bhediya Movie Released Under Geeta Film Distributions

Bhediya: ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దాదాపు ఫుల్ షోస్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఇప్పుడు మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

Bhediya Movie: తోడేలు మనిషిగా వరుణ్ ధావన్.. “భెడియా” ట్రైలర్ రిలీజ్!

బాలీవుడ్ ప్రొడ్యూసర్ దినేష్ విజన్ హారర్-కామెడీ యూనివర్స్‌లో వస్తున్న మరో చిత్రం “భేదియా”. హిందీ, తమిళం మరియు తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25న థియేటర్లలోకి రానుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, కృతి సనన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇదివరకే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది.

ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి పోషిస్తుంది. మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో “గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “భేదియా” తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. మరి ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కి మరో కాంతారా కాబోతుందా లేదా చూడాలి.