Varun Lavanya : వరుణ్ – లావణ్య పెళ్లి వేడుక ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందా?

ఇటీవలే నవంబర్ 5న వరుణ్ - లావణ్య వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరి రిసెప్షన్ ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే వరుణ్ - లావణ్య పెళ్లి వీడియోల్ని మాత్రం ఎక్కడా రిలీజ్ చేయలేదు.

Varun Lavanya Wedding Videos will Stream in a OTT soon Rumours goes Viral

Varun Lavanya Wedding : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇటీవలే ఇటలీలో నవంబర్ 1న గ్రాండ్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుకలు మెగా ఫ్యామిలీ, పలువురు సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. వరుణ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఇటీవలే నవంబర్ 5న వరుణ్ – లావణ్య వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరి రిసెప్షన్ ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే వరుణ్ – లావణ్య పెళ్లి వీడియోల్ని మాత్రం ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఇటీవల పలువురు సెలబ్రిటీలు తమ పెళ్లి వీడియోలను ఓటీటీ సంస్థలకు విక్రయిస్తున్నారు. కొన్ని నెలల క్రితం హన్సిక, అంతకుముందు నయనతార..మరికొంతమంది పలువురు సినీ ప్రముఖులు తమ పెళ్లి వీడియోలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించి ఓటీటీలకు ఇచ్చారు.

Also Read : Varun Lavanya Wedding Reception : ఘనంగా వరుణ్ లావణ్య వెడ్డింగ్ రిసెప్షన్.. ఫొటోలు..

ఇప్పుడు ఇదే బాటలో వరుణ్ – లావణ్య కూడా వెళ్లనున్నట్టు తెలుస్తుంది. వరుణ్ – లావణ్య పెళ్లి వీడియో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు భారీ రేటుకే అమ్మినట్టు సమాచారం. కొన్ని రోజుల తర్వాత వీరి పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అందుకే వీరి పెళ్లి వీడియోలు ఇప్పటివరకు బయటకి రానియ్యలేదని తెలుస్తుంది. మరి వరుణ్ – లావణ్య పెళ్ళి వేడుక ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? ఇది నిజమేనా కాదా? తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.