Varun Tej : అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల పెళ్లి తరువాత.. ఎవరిలో ఎక్కువ మార్పు వచ్చింది.. వరుణ్ తేజ్ ఆన్సర్!

అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల పెళ్లి తరువాత ఎవరిలో ఎక్కువ మార్పు వచ్చింది అని ప్రశ్నించగా వరుణ్ బదులిస్తూ..

Varun Tej : మెగా ఇంట అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్‌ల (Ram Charan) తరువాత పెళ్లి పీటలు ఎక్కడానికి వరుణ్ తేజ్ సిద్దమయ్యాడు. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని (Lavanya Tripathi) ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు వరుణ్. ఇటీవల కుటుంబసభ్యుల మధ్య ఇద్దరు ఎంగేజ్మెంట్ రింగ్ ని మార్చుకొని ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ తాను నటించిన ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) మూవీ విడుదలకు సిద్ధంగా ఉండడంతో ప్రమోషన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు.

Chiranjeevi : చిరంజీవికి సినీ, రాజకీయ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. ఎవరెవరు చెప్పారో తెలుసా..?

ఈ ప్రమోషన్స్ లో వరుణ్ ని ప్రేమ, పెళ్లి డేట్ గురించి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ ని యాంకర్ సుమ ఒక క్రేజీ క్యూస్షన్ అడిగింది. అదేంటంటే.. “అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల పెళ్లి తరువాత ఎవరిలో ఎక్కువ మార్పు వచ్చింది” అని ప్రశ్నించింది. దీనికి వరుణ్ చాలా తెలివైన సమాధానం ఇచ్చాడు. “పెళ్ళైన తరువాత ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. F2 సినిమాలో నేను అదే నేర్చుకున్నాను. ఏమి చేసిన చివరికి భార్యల దగ్గర అంతేగా అంతేగా అని తల ఆడించాలి” అని బదులిచ్చాడు.

Kalki – Chiranjeevi : ప్రభాస్ ‘కల్కి’ ఎడిటింగ్ రూమ్ నుంచి వీడియో లీక్ చేస్తూ.. చిరుకి బర్త్ డే విషెస్..

ఇక వరుణ్, లావణ్య పెళ్లి విషయానికి వస్తే.. ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందని వరుణ్ తెలియజేశాడు. అయితే పెళ్లి తేదీ ఇంకా ఫైనల్ అవ్వలేదట. సినిమా రిలీజ్ అండ్ ప్రమోషన్స్ చూసుకొని త్వరలోనే డేట్ ని ఫైనల్ చేస్తారంటూ వరుణ్ తెలియజేశాడు. పెళ్లి కూడా కేవలం ఇద్దరి ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యలోనే జరగనుందట. అయితే పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో చేసుకోబోతున్నారు. పెళ్లి వేదికకు కోసం ఇండియాలో ఒక మూడు, ఫారిన్ లో రెండు ప్లేస్ లు పరిశీలనలో ఉన్నాయట. త్వరలోనే వీటన్నిటి పై ఒక క్లారిటీ ఇవ్వనున్నాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు