బాక్సర్‌గా వరుణ్ తేజ్
కొత్త సినిమాకోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ ట్రైనింగ్.

కొత్త సినిమాకోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ ట్రైనింగ్.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్2 సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో తన కొత్త సినిమా పనుల్లో హుషారుగా పాల్గొంటున్నాడు. అంతరిక్షంలో వ్యోమగామిగా కనపడిన వరుణ్, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో చెయ్యబోయే వాల్మీకి మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చెయ్యనున్నాడు. తమిళ్ సూపర్ హిట్ జిగర్తండా రీమేక్ ఇది. వాల్మీకితో పాటు మరో సినిమాని కూడా లైన్‌లో పెట్టేసాడు. కొత్త కుర్రాడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ప్ర
స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రిపరేషన్స్ కోసం లాస్ ఏంజిల్స్‌లో ఉన్నాడు. అక్కడ సీరియస్ అండ్ సిన్సియర్‌గా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ట్రైనింగ్ స్టార్ట్స్ నౌ, లాస్ ఏంజిల్స్, బాక్సింగ్ అని, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేసాడు. వాల్మీకితో పాటు ఈ సినిమా కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తుంది. వాల్మీకి రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవనుంది.